బిగ్ బాస్ సీజన్ 4లో 13వ వారం నామినేషన్స్ లో హౌజ్ లో ఉన్న ఏడుగురు హౌజ్ మేట్స్ ఉంటారని తెలుస్తుంది. ఈ క్రమంలో అందరు నామినేషన్స్ లో ఉంటే.. నెక్స్ట్ వీక్ ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. ఇక 13వ వారం నామినేషన్స్ లో మోనాల్, అవినాష్ ఉంటే వారిలో ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఈ వారమే అవినాష్ కు తక్కువ ఓట్లు రాగా నెక్స్ట్ వీక్ తప్పకుండా అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఇక మోనాల్ కూడా ఈ వారం అభిజిత్, హారికల సపోర్టర్స్ కూడా ఓట్స్ వేశారు కాబట్టి ఆమె సేఫ్ అయ్యింది. లేదంటే ఆమె ఈ వారమే బయటకు వచ్చేది. మొదటి నుండి అఖిల్ తో ముద్దుముచ్చట్లు ఆడటమే తన ఆట అనిపించిన మోనాల్ ఈ వారం అందరి కన్నా ముందు సేఫ్ అయ్యింది. ఫైనల్ గా అవినాష్ ఎవిక్షన్ పాస్ సేఫ్ చేయగా 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవకుండా జరిగింది.

13వ వారం మాత్రం అందరు నామినేషన్స్ లో ఉంటే మొదటి రిస్క్ మోనాల్ కు ఆ తర్వాత అవినాష్ కు ఉంటుందని అంటున్నారు. ఇక తర్వాత పొజిషన్ లో హారిక ఉంది. సో ఫైనల్ గా 13వ వారం ఎలిమినేషన్ కూడా టఫ్ గా సాగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ వారం కసిగా ఆడి టాస్కుల్లో బాగా ఆడితే లెక్కలు తారుమారయ్యే ఛాన్స్ ఉంది. అయితే అది ఎలా ఉంటుంది అన్నది మాత్రం రానున్న ఎపిసోడ్స్ తో తెలుస్తుంది.                                                

మరింత సమాచారం తెలుసుకోండి: