బుల్లి తెరపై హాట్ యాంకర్ల లో ఒకరు అనసూయ.. ఈమె వయసు ఎంత, పెళ్లి అయ్యిందా , పిల్లలు ఉన్నారా అనే విషయాలను ఎవరు పట్టించుకోరు.. కేవలం ఆమె వేసే డ్రెస్సులను మాత్రమే చూస్తారు.. ఆమె వేసే డ్రెస్సులకు అందాలకు అభిమానులు రోజు రోజుకు పెరుగుతున్నారు.. ఒకవైపు బుల్లి తెర పై ప్రసారమవుతున్న షో లలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలలో కూడా నటిస్తుంది.ఇప్పటి వరకు ఆమె చేసిన సపోర్టింగ్ రోల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఎప్పుడు చురుగ్గా పాల్గొంటుంది.. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.



తాజాగా ఓ స్టార్ హీరోతో గడిపిన సరదా క్షణాలను నెటిజన్ల ముందుంచింది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారి తెగ చెక్కర్లు కొడుతోంది.సౌత్ ఇండియన్ స్టార్ విజయ్ సేతుపతితో నవ్వులు చిందిస్తూ కనిపించి షాకిచ్చింది అనసూయ భరద్వాజ్. అంతేకాదు ఆ ఫోటోని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. 'టాలెంటెడ్ పర్సన్‌తో బాండింగ్' అంటూ తనదైన స్టైల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆ ఫోటోలో అనసూయ ఏదో చేస్తూ బుక్కయ్యినట్లు అతనిపై చెయ్యి వేసి కనిపిస్తుంది..



తమిళ స్టార్ హీరోతో అను ఫోటో ఎలా దిగింది..ఎందుకు దిగింది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు..అనే అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇకపోతే ''బాబోయ్! బాండింగ్ మామూలుగా లేదే, బ్యూటిఫుల్, కాంబో సూపర్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు..ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ జోడీ చాలా బాగుంది ఎప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం 'థాంక్యూ బ్రదర్' అనే సినిమాలో ఛాలెంజింగ్ రోల్ పోషిస్తోంది. ఇందులో గర్భవతిగా ఆమె కనిపించనుండటం విశేషం. ఇటీవలే అనసూయ ప్రెగ్నెంట్‌గా ఉన్న పోస్టర్‌ని ఫస్ట్‌లుక్‌ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.. మరి సినిమా ఏ రేంజులో ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: