తెలుగు సినిమా పరిశ్రమకి తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నట వారసుడిగా తాతమ్మకల సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం, అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న బాలయ్య ఇక అక్కడి నుండి వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ కొనసాగారు. మొదటి నుంచి కూడా తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే అభిమానులు అలానే ప్రేక్షకులను అలరించే విధంగా ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు పలు సినిమాలు చేస్తూ కొనసాగిన బాలయ్య తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని పాపులారిటీ తో పాటు ఎందరో ప్రేక్షకుల మనస్సులో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇక తన కెరీర్ లో వందకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య దివంగత నటి శ్రీదేవి తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. నిజానికి శ్రీదేవి, సీనియర్ ఎన్టీఆర్ తో ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి భారీ విజయాలు సొంతం చేసుకొని హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్నారు. ఆయనతో పాటు ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారితో కూడా హీరోయిన్ గా నటించిన శ్రీదేవి ఇక ఆ తర్వాత తరంలో వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ సరసన కూడా హీరోయిన్ గా నటించి తిరుగులేని నటిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. అయితే ఆమె కేవలం ఒక్క బాలకృష్ణ సరసన మాత్రమే హీరోయిన్ గా నటించకపోవటానికి ఒక బలమైన కారణం ఉందని సమాచారం.

నిజానికి ఒక బడా ప్రొడ్యూసర్ మరియు దర్శకుడు అప్పట్లో శ్రీదేవి, బాలయ్య కాంబినేషన్లో ఒక సినిమాను సిద్ధం చేశారని కాగా ఆ సినిమాని ప్రారంభించాలి అనుకుంటున్న సమయంలో హీరోయిన్ గా శ్రీదేవితో నేను చేయలేను అంటూ బాలయ్య చెప్పారట. అయితే దానికి కారణం శ్రీదేవి పై తనకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, నాన్న గారితో మానవరాలిగా, హీరోయిన్ గా నటించిన ఆమె సరసన తాను హీరోయిన్ గా నటించలేనని దయచేసి తనని ఇబ్బంది పెట్టవద్దని ఆ సినిమా అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారట బాలయ్య. ఇక ఆ తర్వాత నుంచి మరెప్పుడూ కూడా ఆమెతో కలిసి నటించే అవకాశం బాలయ్య రాలేదు. ఇక అప్పట్లో ఒకానొక సందర్భంలో బాలయ్యతో సినిమా చేయకపోవటం విషయమై శ్రీదేవి మాట్లాడుతూ కావాలని ఆయనతో సినిమా చేయకపోవడం అనే ఉద్దేశం తనకు లేదని, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ లనే బాలయ్య కూడా మంచి నటుడని అయితే అనుకోకుండా అలా జరిగిపోయింది తప్ప వేరే కారణం ఏమీ లేదని ఆమె చెప్పినట్లు సమాచారం. మొత్తంగా చూసుకుంటే అప్పటి దిగ్గజ నటులు అందరితో కలిసి హీరోయిన్ గా నటించిన శ్రీదేవి ఒక్క బాలయ్య సరసన మాత్రమే హీరోయిన్ గా చేయకపోవటం ఒక రకంగా యాదృచ్చికమే అంటున్నారు విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: