తాము ఎంతగానో అభిమానించే హీరో సినిమా వస్తుందంటే చాలు ఫాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని మరి ఎదురు చూస్తారు. అలాగే ఒక తెరపై ఒక హీరోని చూస్తేనే బొమ్మ అదిరిపోతుంది. అలాంటిది ఒకే తెరపై ఇద్దరు హీరోలను చూస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. అలాంటి మల్టీ స్టార్ మూవీల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఇలా చాలామంది స్టార్స్ కాంబినేషన్ లో చాలా రకాల సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ వారసులు ఇద్దరు కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్  సినిమా పైనే అందరి ద్రుష్టి ఉంది. rrr సినిమాకి సంబందించిన ఏ  చిన్న అప్డేట్ వచ్చినాగాని అభిమానులు సంబరాలు మాములుగా ఉండడం లేదు.అలాగే ఏ ఆర్.ఆర్.ఆర్ సినిమా నే కాకుండా మరికొన్ని మల్టీ స్టార్ సినిమాలు కూడా మన ముందుకు రానున్నాయి. అన్నింటికీ మించి నందమూరి-మెగా ఫ్యామిలీ హీరోలు కలిసి నటిస్తున్న ’ఆర్ఆర్ఆర్‘ సినిమా మీదనే అందరి దృష్టి ఉంది.

 ఎందుకంటే ఈ  రెండు కుటుంబాలకు సినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరుతో పాటు, అభిమానులు కూడా ఉన్నారు. అందుకే ఏ సినిమా కోసం అందరు వేచి చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి దర్శక దిగ్గజం  రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నందమూరి, మెగా ఫ్యామిలీ కాంబినేషన్లో rrr సినిమా కాకుండా  ఇంతకుముందే ఈ కాంబినేషన్ లో ఒక సినిమా కూడా వచ్చింది. మరి ఆ సినిమా ఏంటి అనే విశేషాలను ఓసారి గుర్తు చేసుకుందాం.!

సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు తిరుగులేని మనిషి అనే  సినిమా విడుదల అయింది  మీకు గుర్తుందా.. ! ఆ సినిమాలో  సీనియర్ ఎన్టీఆర్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా కలిసి నటించాడు. ఎన్టీఆర్, చిరంజీవి  కలిసి  నటించిన ఒకే ఒక్క సినిమా తిరుగులేని మనిషి.  1981వ సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లాయర్ గా నటించారు. చిరంజీవి క్లబ్ లో పాటలు పాడే రోల్ ను ప్లే చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ ఒక నెగటివ్ రోల్ లో నటించడం గమనార్హం. చిరంజీవి, ఎన్టీఆర్ ఇద్దరు బావ,  బావ మరదిగా నటించారు. అంటే ఎన్టీఆర్ చెల్లికి భర్తగా చిరంజీవి నటించాడు. సినిమా చివరిదాకా చిరంజీవి ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ను పోషించారు. క్లైమాక్ లో చిరంజీవిలో మార్పు వచ్చి బావ సరసన చేరి  రౌడీ మూకల ఆటను కట్టిస్తారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.అందుకే చాలామందికి ఈ సినిమా గుర్తులేదు. ఈ సినిమా వచ్చి ఇప్పటికి దాదాపు  40 ఏళ్ల అవుతుంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల గ్యాప్  తర్వాత మళ్లీ మెగా, నందమూరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది.ఈ సినిమా కోసం నందమూరి, మెగా అభిమానులే కాదు సినీ ఇండస్ట్రీ అంతా కళ్ళు కాయలు కాచేలా  ఎదురుచూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: