బన్నీ డ్యాన్స్ పట్ల ఎంతో మంది స్టార్స్ ఫిదా అయ్యారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. బన్నీ డ్యాన్స్ పట్ల ఉన్న అభిమానాన్ని స్టార్స్ అప్పుడప్పుడు బయటపెడుతుంటారు. రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ కూడా బన్నీ పట్ల తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఆ స్టారెవరో కాదు బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరో టైగర్ ష్రాఫ్. బాలీవుడ్ యంగ్ హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్. అదిరిపోయే తన డ్యాన్స్ తో బి టౌన్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంలో పూర్తి విజయం సాదించారు ఈ కుర్రహీరో. ఈ టైగర్ హీరో ఇప్పటి వరకు చేసి దుమ్ములేపిన డ్యాన్స్ మూమెంట్స్ ఎంత కష్టమైనవో మాటల్లో చెప్పలేం. అందుకే ఈ హీరో తనదైన స్టెప్పులతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు.
అయితే ఈ హీరో సినిమాలతో పాటుగా కొన్ని ప్రైవేట్ సాంగ్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అయితే ఈ హీరో తాజాగా సోషల్ మీడియా వేదికగా టైగర్ ష్రాఫ్.. ఆస్క్ టైగర్ అంటూ తన ఫ్యాన్స్ తో ముచ్చటపెట్టారు. అందులో భాగంగా ఈ హీరోను తన ఫ్యాన్స్ ఎన్నో ప్రశ్నలను అడిగారు. దానికి ఈ యువ హీరో కూడా కూల్ గా సమాధానాలు చెప్పుకుంటు వెళ్లారు. అయితే అందులో భాగంగానే ఓ వ్యక్తి టైగర్ ను ‘మీకు అల్లు అర్జున్ లో నచ్చే అంశాలు ఏవంటూ’ ప్రశ్నించాడు. దానికి టైగర్ మాటల్లో చెప్పడం కష్టమైన పనే అది. ఎందుకంటే నేను బన్ని స్టైల్ కు డ్యాన్స్ మూమెంట్స్ కు అభిమానిని అంటూ బదులిచ్చాడు. నేను కూడా అల్లు అర్జున్ లా డ్యాన్స్ చెయ్యాలనుకుంటున్నాని చెప్పుకొచ్చాడు టైగర్. ఈ హీరో తన స్టైల్ తో పాటుగా ఇరగదీసే స్టెప్పులతో దేశమంతటా ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకున్నాడు.