కొందరి దర్శకుల సినిమాలు రిలీజ్ కాకమునుపే.. కేవలం పోస్టర్లు, టీజర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలనే క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి క్రేజ్ ను సంపాదించుకున్న డైరెక్టరే రాజమౌళి. ఈ దర్శక ధీరుడి సినిమాల పట్ల ప్రేక్షకులు ప్రత్యేక ఇంట్రిస్ట్ చూపిస్తుంటారు. బాహుబలి సినిమా కూడా భారీ అంచనాలతో రిలీజై కోట్లను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా పేరుతెచ్చుకుంది. ఆ సినిమాతోనే ఈ డైరెక్టర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి ఈ దర్శక ధీరుడి డైరెక్షన్ లో వచ్చే సినిమాల కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా యంగ్ హీరో రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ చిత్రీకరణ జరుపుతున్నట్టుగా  రాజమౌళి టీం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో పాటుగా ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్న ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. ఆ ఫోటోలో రక్తపు మరకలతో ఇద్దరు వ్యక్తులు చేతులు పట్టుకున్నారు. దాన్ని బట్టి యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చేతులపై రకరకాల కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.

ఈ ఫోటోను చూసిన చాలా మంది రకరకాల ప్రశ్నలను కూడా అడిగేస్తున్నారు. అసలు ఇందులో ఉన్న ఆ ఇద్దరు హీరోలు కలిసి వేరే వ్యక్తులతో ఫైటింగ్ చేస్తున్నారా.. లేక వారే తలబడుతున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంటే వీరు కలిసి సింగిల్ ఫ్రేమ్ లో కనిపించేది కేవలం క్లైమాక్స్ లోనే నా అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా.. మరి కొందరేమో వీరిద్దరు స్వాతంత్య్ర సమరయోధులే మరెందుకు ఈ  హీరోలు కొట్లాడుకుంటారబ్బా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కొత్త ఫోటోతో ఎవరికి వారు ఆ ఫోటో సీన్ ను ఊహించుకుంటున్నారు. ఎవరి ఊహ ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడక తప్పదు మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: