సినిమా హాలు అంటే ఒకప్పుడు యమ క్రేజ్. పల్లెటూర్లో టూరింగ్ టాకీసులు ఉండేవి. తడికలు నాలుగు అటూ ఇటూ చేర్చి లోపల ఇసుక పోసి జనాలకు కూర్చోబెట్టి వెనక నుంచి ప్రొజెక్టర్ పెట్టి బొమ్మ వేసే పాతకాలం తీపు ముచ్చట్లూ ఉన్నాయి. ఇక ఆ తరువాత సినిమా హాళ్ళు అంటే చక్కగా నిర్మించి సౌండ్స్ ఎఫెక్టులు తెచ్చారు.

అలా కాలంతో పాటు మారిన టెక్నాలజీ సినిమాను ఎక్కడికో తీసుకుపోయింది. మల్టీప్లెక్సుల రోజులు ఇపుడు నడుస్తున్నాయి. సినిమా చూడాలి అంటే హ్యాపీగా మొత్తం విజువల్ సౌండ్ ఎఫెక్టులను కలగలిపి చూపిస్తున్నారు. అయితే మరింతగా పెరిగిన టెక్నాలజీతో సినిమా ఏకంగా చేతుల్లోకి వచ్చేసింది స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సినిమా చూసేయడం అన్నది అలవాటు అయింది. దానికీ వారూ వీరూ అన్న తేడా లేదు. ఈ దేశంలో ఉన్న జనాభా కంటే కూడా ఎక్కువగా ఫోన్లు ఉన్నాయి. ఇక కూలీ పనులు చేసుకునే వారికి కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వారంతా వందల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా హాళ్ళకు రావడం మానుకుంటే ఇక బంద్ అవడం ఖాయమే.

ఇపుడు అలాంటి ప్రమాదమే థియేటర్లకు వచ్చిపడుతోంది. థియేటర్లకు పోటీగా ఓటీటీలు వచ్చి చేరాయి. ఈ డిజిటల్ ఫ్లాట్ ఫారం నుంచి పెను సవాల్ పొంచి ఉందని అంటున్నారు. కరోనా టైం లో అడుగు బయట పెట్టకుండా ఓటీటీలో సినిమా చూసిన జనాలు ఇపుడు మెల్లగా థియేటర్లకు వస్తున్నారు అన్న సంతోషం ఎక్కువ సేపు నిలవడంలేదు.

ఎందుకంటే సంక్రాంతి పండుగ కాబట్టే జనాలు అలా వచ్చారు. కానీ ఆ తరువాత రిలీజ్ అయిన సినిమాలకు అసలు వసూళ్ళు లేవు. దీంతో డొల్లతనం ఏంటో బయటపడిపోతోంది. ఇవన్నీ పక్కన పెడితే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన క్రాక్ మూవీని అపుడే ఓటీటీకి ఇచ్చేశారు. అలాగే మాస్టర్ సినిమా కూడా డిజిటల్ ఫ్లాట్ ఫరం మీద రిలీజ్ అవుతోంది. ఇన మరిన్ని సినిమాలు కూడా క్యూ కడుతున్నాయి. రానున్న  రోజుల్లో సినిమా థియేటర్లలో ఆడేందుకు కష్ట‌మన్న సినిమాలకు ఓటీటీ అతి పెద్ద వేదిక అయి కూర్చుంటుంది అంటున్నారు. మరి సినిమా హాళ్ళకు ఫీడింగ్ ఎక్కడిది అంటే బడా సినిమాలే అంటున్నారు. అంటే ఆ సినిమాలు రిలీజ్ అయితేనే థియేటర్లు తెరుచుకుంటాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: