ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఈ కరోనా లాక్ డౌన్ వల్ల చాలా మంది సెలెబ్రెటీల పెళ్లిళ్లు జరిగాయి. ఇక ఇటీవల  బాలీవుడ్ లో ఎంతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన యువ నటుడు  వరుణ్ ధావన్ కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన నటాశా దలాల్ ను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ముంబై అలిబాగ్ లోని రెస్టారెంట్ లో ఈ జంట  పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో ఎంతో అంగ రంగ వైభవంగా  జరిగింది. ఈ పెళ్లి  వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు వరుణ్. ఈ క్రమంలో అతని అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా మంచిగా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.



ఈ క్రమంలో టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని  ‘జెర్సీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన  శ్రద్దా శ్రీనాధ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.‘మరో గ్రేట్ యాక్టర్ పెళ్లి చేసేసుకున్నాడు.బహుశా అతన్ని మళ్లీ స్క్రీన్ పై చూడాలేమేమో . ఇక నుంచి  అతను  మిగిలిన హీరోయిన్లతో నటిస్తే అతని భార్య నటాషా, అత్తగారు ఒప్పుకోరేమో. దాంతో ఇక మీదట అతను మేల్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసుకోవాలేమో.. ఇక నుండీ పర్సనల్ లైఫ్ ను, వర్క్ లైఫ్ ను అతను ఎలా బ్యాలెన్స్ చేస్తాడో..ఏదైమైనా మనం అతన్ని మిస్ అవుతున్నాం. వివాహ శుభాకాంక్షలు” అంటూ ఎటకారంగా  కామెంట్స్ చేసింది.

ఇలా చాలా ఇంటర్వ్యూలలో హీరోయిన్లను మీడియా అడిగే ప్రశ్నల గురించి ఇలా ఇండైరెక్ట్ గా సెటైర్లు వేసింది మన జెర్సీ భామ. దాంతో ఈ కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్లను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు మాత్రం శుభమా అని అతను పెళ్లి చేసుకుంటే.. ఇలాంటి కామెంట్లు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజజీవితంలో కూడా శ్రద్ధా ఏ విషయం పైన కూడా  ఇలానే  ఘాటుగా స్పందిస్తుంటుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


మరింత సమాచారం తెలుసుకోండి: