అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న సినిమా నాంది. ఈమధ్యనే బంగారు బుల్లోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ ఈ సినిమాతో కూడా నిరాశపరచాడు. రొటీన్ ఫార్ములాతో వచ్చిన బంగారు బుల్లోడు కూడా నరేష్ ఫ్లాపుల నుంచి బయటపడేయలేదు. ఇక అల్లరోడు నెక్స్ట్ చేస్తున్న నాంది సినిమాపై ఈ ఎఫెక్ట్ పెద్దగా పడలేదని తెలుస్తుంది. నాంది సినిమా టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. నరేష్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా వస్తుంది.

అంతేకాదు నాంది సినిమాలో అల్లర్ నరేష్ ఒక సీన్ లో న్యూడ్ గా కనిపించి షాక్ స్తాడట. అల్లరి నరేష్ కెరియర్ లో నాంది సినిమా చాలా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో అల్లరోడు క్యారక్టర్ మొత్తం సీరియస్ గా ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా అల్లరి నరేష్ ను ఈ సినిమా హిట్ అందుకునేలా చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు.

మహర్షి తర్వాత అల్లరి నరేష్ బంగారు బుల్లోడు మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు కాని ఆశించిన స్థాయిలో ఇది ఆడలేదు. అయితే నాంది మాత్రం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా వస్తుంది అందుకే నాంది తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు. నాంది సినిమా జీ సంస్థ ఎనిమిదిన్నర కోట్లకు కొనేసినట్టు తెలుస్తుంది. థియేటర్ రిలీజ్ తర్వాత జీ 5 లో ఇది అందుబాటులో ఉంటుంది. మరి నాందిపై నరేష్ పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలంటే సినిమా చూడాల్సిందే.                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: