ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ 'సుడిగాడు' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత 9 ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే .. 2021 ఆరంభంలో కూడా 'బంగారు బుల్లోడు' తో బాక్స్ ఆఫీస్ వద్ద ఎంట్రీ ఇచ్చి నిరాశపరిచాడు. అయినప్పటికీ డిజప్పాయింట్ అవ్వకుండా స్ట్రాంగ్ అయ్యి ఆ వెంటనే ఫిబ్రవరి 19న 'నాంది' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు.ఇప్పటివరకూ కామెడీ హీరోగానే రాణిస్తూ వచ్చిన నరేష్.. ఈసారి కంప్లీట్ సీరియస్ రోల్ ప్లే చేసిన చిత్రమిది. మొదటి రోజు హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ఆ రోజున ఆశించిన మేర కలెక్ట్ చెయ్యలేకపోయింది. అయితే రెండో రోజు నుండీ కొంచెం పికప్ అయ్యిందనే చెప్పాలి..


ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే 'నాంది' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 2.75 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకో 0.50కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో ఈ చిత్రం బాగా పెర్ఫార్మ్ చేస్తే ఆ ఫీట్ సాధించే అవకాశం ఉంటుంది.మొదటి సోమవారం నాడు ఈ చిత్రం 0.47కోట్ల షేర్ ను రాబట్టింది.ఇంకొక యాభై లక్షలు రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి సేఫ్ అయ్యే అవకాశం వుంది. చూడాలి ఇక ఈ సినిమా ఎంతమేరకు రాబడుతుందో.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: