మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన డైరెక్టర్ శంకర్ కలయికలో పాన్ ఇండియా మూవీ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై 50 వ మూవీ గా దీనిని నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీ రామ్ చరణ్ కు 15వది కావడం విశేషం. ఇక ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుండి మెగా అభిమానులు అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్లే ఈ మూవీ కి సంబదించిన ఏదో ఒక వార్త ప్రతి రోజు మీడియా లో ప్రచారం అవుతూ వస్తున్నాయి. ఈ భారీ మూవీ కి తమిళ్ రాక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగగా.. ఆ తర్వాత హీరోయిన్ల పేర్లు షికారు చేయడం స్టార్ట్ అయ్యింది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక ను మెయిన్ హీరోయిన్ గా కొరియా న‌టి సెకండ్ హీరోయిన్ గా శంకర్ ఫిక్స్ చేసినట్లు మీడియా లో ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇక ఈ రెండే అనుకుంటే ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చి ఇంకాస్త అంచనాలు పెంచేస్తుంది.

మూవీ లో ఓ కీలక రోల్ కు గాను సూర్య ను శంకర్ సంప్రదించారనే వార్త వైరల్ గా మారింది. ఇప్పటివరకు శంకర్ డైరెక్షన్లో సూర్య ఒక్క మూవీ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో శంకర్ రోల్ గురించి చెప్పగానే ఓకే అనేసాడని తమిళ్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.  రీసెంట్ గా సూర్య ఆకాశమే నీ హద్దురా మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో సూర్యమూవీ లో నటిస్తే సినిమాకు అదనపు ఆకర్షణ రావడం ఖాయం అని మెగా అభిమానులు సైతం మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది చిత్ర యూనిట్ చెప్పాల్సి ఉంది.

ప్రస్తుతం రామ్ చరణ్ ..రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే శంకర్ మూవీ సెట్ లో జాయిన్ కానున్నాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: