ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. వెంకటేష్ తన అన్న కొడుకు రానా కి ఎసరు పెట్టడమేంటి అనుకున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ధనుష్ సినిమా "అసురన్" ని తెలుగులో "నారప్ప" గా రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.ఇక నారప్ప రిలీజ్ డేట్ ని మార్చే పనిలో ఉందట మూవీ టీమ్. ఈ సినిమాని ప్రీ పోన్ చేసి అనుకున్న టైమ్ కంటే ముందే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ముందుగా మే నెల 14వ తేదిన ఈ సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. వెంకటేష్ తో ఉన్న పోస్టర్ ని సైతం రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ని లాక్ చేశారు.అయితే, ఒక్కరోజు ముందు మెగాస్టార్ ఆచార్య సినిమా ఉండటం అనేది ఇప్పుడు నారప్ప రూట్ మార్చేలా చేసింది.


మే 13వ తేదిన మెగాస్టార్ ఆచార్యగా థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. సమ్మర్ లో వస్తున్న మెగా ప్రాజెక్ట్ ఇదే కావడంతో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు సైడ్ ఇచ్చేశాడని అంటున్నారు.అయితే, ఈసినిమా ఏప్రిల్ 30వ తేదినకి మార్చబోతున్నట్లుగా సమాచారం. ఈ డేట్ కి ఆల్రెడీ రానా విరాటపర్వం సినిమా రిలీజ్ ని ప్రకటించారు..దీంతో రానాకి చెక్ పెట్టేందుకు నారప్ప రాబోతున్నాడా అని కూడా వార్తలు వస్తున్నాయి.దీనికి సురేష్ బాబు అండ్ టీమ్ తో మాట్లాడారని విరాటపర్వం టీమ్ వాళ్ల సినిమాని వాయిదా వేసుకోవడానికి అంగీకారం తెలిపారని కూడా చెప్తున్నారు.


రానా విరాటపర్వం మే నెలలో మంచి డేట్ చూస్కుని ఫిక్స్ చేస్కోబోతున్నారట.నిజానికి ఎప్పట్నుంచో షూటింగ్ జరుపుకుంటున్న విరాటపర్వం లేట్ గా రిలీజ్ అయితే నష్టపోయే అవకాశం ఉంది. కాని వెంకటేష్ వల్ల లేట్ గా రిలీజ్ అవ్వాల్సి వస్తుంది..మొత్తానికి వెంకటేష్ వెళ్లి రానా సినిమాకి ఎసరు పెట్టినట్లుగానే ఉంది వ్యవహారం అంటూ సినీ పండితుల నుంచి గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక బ్రహ్మోత్సవం తో ప్లాప్ ని ఎదుర్కున్న తరువాత నారప్పతో ఎలా అయిన పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో వున్నాడట శ్రీకాంత్ అడ్డాల...

మరింత సమాచారం తెలుసుకోండి: