ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రణ్ బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత అందమైన హీరోనో అంతే గొప్ప నటుడు కూడా. ఎన్నో మంచి సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రణ్ బీర్. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ వంగ అదే కథను బాలీవుడ్ కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ వంగ అదే కథను బాలీవుడ్ కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కబీర్ సింగ్ గా వచ్చిన ఆ సినిమా అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను అందుకుంది. ఇక తెలుగులో హిట్టిచ్చినా కూడా స్టార్ హీరోలతో ఛాన్స్ అందుకోలేకపోయిన సందీప్ బాలీవుడ్ లో మాత్రం మంచి ఆఫర్ పట్టాడు. ఏకంగా రణ్ బీర్ కపూర్ తో 'యానిమల్' అనే ఒక యాక్షన్ సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్...


ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు  దాదాపుగా పూర్తి అయ్యాయి..ఇక పక్కా ప్లాన్ తో షూటింగ్ వేగం పెంచనున్న సందీప్ రిలీజ్ పై కూడా ముందే క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. ఇక కుదిరితే యానిమల్ సినిమాను తెలుగుతో పాటు వివిధ భాషలలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇంతవరకు టాలీవుడ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపని రణ్ బీర్, సందీప్ టాలెంట్ ను నమ్మి తెలుగు మార్కెట్ పై కూడా మంచి నమ్మకంతో వున్నాడట.. ఖచ్చితంగా తనకు తెలుగులో మంచి మార్కెట్ వస్తుందని నమ్మకంగా వున్నాడట...

సందీప్ అర్జున్ రెడ్డి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక హిందీ కబీర్ సినిమా తెలుగు రాష్టాల్లో కూడా విడుదల కాగా మల్టిప్లెక్స్ లలో మంచి క్రేజ్ అందుకుంది. మరి రణ్ బీర్ కపూర్ తో తీస్తున్న "యానిమల్" సినిమా ఎంతవరకు రణ్ బీర్ కి మంచి మార్కెట్ ఇచ్చి హిట్ అవుతుందో లేదో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: