బాలీవుడ్ నటి కంగనా రణౌత్ తన ఆటిట్యూడ్ తో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. నిత్యం ఏదో ఒక వివాదం తో తల దూర్చడం పోలీసు కేసుల్లో ఇరుక్కోవడం కామన్ అయ్యింది. నిజానికి కంగనా రనౌత్ క్వీన్ సినిమా ముందు వరకు అందరు హీరోయిన్ లలా సాధారణంగానే ఉండేది. కానీ క్వీన్ సక్సెస్ తో వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. దాంతో తన కంటే తోపెవరూ లేరని ఫీల్ అవుతుంది. ఇక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం ఈ అమ్మడు రెచ్చి పోయి బాలీవుడ్ స్టార్స్ అందరి పైనే మండిపడింది. బాలీవుడ్ లో నిపోటీజమ్ కారణంగా నే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు చేస్తూ వీడియోలను పోస్ట్ చేసింది. అంతే కాకుండా మహా సర్కార్ పై కూడా విమర్శలు చేయడంతో సర్కార్ కంగనా బిల్డింగ్ అక్రమ కట్టడమని కూల్చివేశారు.

దాంతో మహా సర్కార్ తో పెట్టుకుని కేంద్రం లో ఉన్న బీజేపీ కి సపోర్ట్ ఇవ్వడం మొదలెట్టింది. అప్పటి నుండి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ పై నిప్పులు చేరుగుతూనే ఉంది. అంతే కాకుండా రైతులపైనే ఫైర్ అయ్యింది. దాంతో కంగనా పై కుప్పలకు కుప్పలు కేసులు నమోదయ్యాయి. కఠిన నేరస్థులు.. ఉద్యమ కారులు..కొందరు రాజకీయ నాయకులపై ఈ రేంజ్ లో కేసులు ఉంటాయి గాని ఒక సినిమా నటిపై ఇన్ని కేసులు అంటే ఆశ్చర్యకరమే...కంగనా పై మొత్తం 700 కేసులు ఉన్నాయట. ఈ విషయాన్ని తానే వెల్లడించింది. అంతే కాకుండా కంగనా తన మనికర్ణిక సినిమాలో భాగస్వామి అయిన అక్షయ్ రౌత్ ఈ కేసులన్నింటిని ఒంటి చేత్తో డీల్ చేస్తున్నాడని పేర్కొంది. తన ఇంట్లో తరచూ ఈ కేసుల పై సమావేశాలు జరుగుతున్నాయని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: