ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.పందెం కోడి, భరణి, పొగరు, సెల్యూట్ సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు.తెలుగు స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.వైవిధ్యమైన సినిమాలతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక విశాల్ తాజాగా నటించిన చిత్రం 'చక్ర'. ఎం.ఎస్.ఆనందన్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ' పై హీరో విశాలే నిర్మించడం విశేషం. 'జెర్సీ' బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కూడా కీలక పాత్ర పోషించింది. ఫిబ్రవరి 19న విడుదల అయిన ఈ చిత్రానికి మొదటిరోజే డివైడ్ రావడంతో ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.ఆకట్టుకునే కంటెంట్ ఇంకా ఈ సినిమా స్టోరీ బాగున్నా కాని కొంచెం అభిమన్యుడు చిత్రంకి పోలికగా అనిపించడంతో ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది ఈ చిత్రం. వీకెండ్ వరకూ మంచి ఓపెనింగ్స్ ను రాబట్టినప్పటికి బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయింది ఈ సినిమా.


ఇక "చక్ర" సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫైనల్ గా ఎంత వసూలు చేసిందంటే....'చక్ర' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.9కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 5.4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 3.37 కోట్ల షేర్ ను రాబట్టింది.దీంతో ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు 1.6 కోట్ల వరకూ నష్టాలను మిగిల్చినట్టు అయ్యింది. ఇక ఈ సినిమాతో విశాల్ ప్లాప్ ని మూటగాట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: