బుల్లితెర లేడి సూపర్ స్టార్ సుమ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె తన మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. సంవత్సరాల తరబడి యాంకరింగ్ చేస్తున్నా ఆమె చేస్తున్న షోలకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గడం లేదు. అయితే యంగ్ హీరో నాని సుమ పరువు తీసేశారు. ఈటీవీ ఛానెల్ లో సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ షోకు నాని, రీతూవర్మ, శివ నిర్వాణ, తిరువీర్ వచ్చారు. క్యాష్ షోకు నాని రావడంతో సుమ ఆనందంతో చప్పట్లు కొట్టి నానీని షోలోకి ఆహ్వానించారు.

అయితే షోలో భాగంగా సుమ అమ్మాయిలకు ఆంటీ ఆంటీ అని పిలవడం అస్సలు ఇష్టం ఉండదని చెబుతుండగా నెక్స్ క్వషన్ ఆంటీ అంటూ నాని సుమ పరువు తీసేశారు. ఆ తర్వాత తనను ఎవరు ఆంటీ అని పిలిచినా ఫీల్ కానని నాని అంటే మాత్రం ఫీల్ అవుతానని సుమ చెప్పుకొచ్చారు. నేను క్యాష్ షో నుంచి వెళ్లిపోతున్నానంటూ సుమ సరదాగా చెప్పారు. అయితే నాని మాత్రం ఆ తరువాత కూడా సుమను పదేపదే ఆంటీ అని పిలుస్తూ ప్రేక్షకులను నవ్వించారు.



ఇక ఈరోజు సుమ ఆంటీ షోకు రావడం చాలాచాలా సంతోషంగా ఉందని నాని చెప్పగా సుమ ఏడుపు మొహం పెట్టేశారు. నేను సుమ ఆంటీకి పెద్ద ఫ్యాన్ అని నాని అన్నారు. ఆ తరువాత సుమ ఆంటీ అనే పదాన్ని బ్రిటిష్ వాళ్లు వదిలేసి వెళ్లారని మీరు నిజమైన దేశభక్తులు ఐతే ఆ పదాన్ని వాడవద్దని చెబుతారు. ఆ తరువాత ఆంటీ అనే పదాన్ని అస్సలు వాడనంటూ నాని సుమను పిన్నీ అని పిలుస్తారు. ఆంటీ అని పిలవొద్దని చెబితే నాని పిన్ని అని పిలవడంతో అవాక్కవడం సుమ వంతయింది. ఇప్పుడు ఈ షో ప్రోమో ప్రేక్షుకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: