ఈమధ్య మన తెలుగు దర్శకులు ఇతర భాషల సినిమాలు చేయడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. మన తెలుగు హీరోలు ఇతర భాషల దర్శకులపై ఎలాంటి మోజు అయితే చూపిస్తున్నారో దర్శకులు కూడా పరభాషా హీరోలతో సినిమా చేయడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు. అలా చాలామంది టాలీవుడ్ దర్శకులు పరభాషా సినిమాలకోసం తలైపోతున్నారు.. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ, వంశీ పైడిపల్లి, రాజ్ డీకే, వినాయక్ , సుజిత్ వంటి దర్శకులు ప్రస్తుతం వేరేభాషల్లోనే సినిమా లు చేస్తున్నారు..

మళ్ళీ తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తారో అన్న అనుమానం అభిమానుల్లో నెలకొంది.. ఇప్పుడు దర్శక ద్వయం రాజ్ నిడిమోరు-కృష్ణ డీకే చెప్పుకోవాలి.. 2003 లోనే సినిమాలు చేయడం మొదలుపెట్టిన వీరు ఇప్పటివరకు తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. డి ఫర్ దోపిడీ అనే సినిమా ను చేసిన వేరు మళ్ళీ ఆ తర్వాత తెలుగు సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించలేదు.. పుట్టి పెరిగిన తెలుగు నాడు ని మర్చిపోయి వారు బాలీవుడ్ లో టాప్ దర్శకులుగా ఉన్నారు..అక్కడ సినిమాలు చేస్తూ హిట్ లుకొడుతున్నారు కానీ తెలుగులో సినిమా కూడా చేయలేకపోతున్నారు..

వారి దర్శకత్వంలో ఫ్లేవర్స్, 99, షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్ లాంటి విభిన్న చిత్రాలు రాగా ప్రస్తుతం ది ఫామిలీ మెన్ సిరీస్ తో ట్రేండింగ్ లో ఉన్నారు ఈ దర్శక ద్వయం.. మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. రెండవ సీజన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.. అంచనాలు కూడా భారీ గా ఉండడంతో వీరు తెలుగు వారే అన్న వార్త తెలుగు ప్రేక్షకులను ఎంతో ఖుషి చేస్తుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచే ఈ ఇద్దరూ వచ్చారు. ఐతే ఇద్దరూ ముంబయిలో కలిశారు. అక్కడే దర్శకులుగా అవకాశాలందుకున్నారు. మంచి స్థాయికి చేరుకున్నారు. మరి తెలుగు సినిమా సంగతి ఏంటి అని అడిగితే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి నటులతో టచ్ లోనే ఉన్నాం త్వరలోనే ఓ సినిమా చేస్తాం అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: