సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. మనిషి మనసు బాగాలేనప్పుడు సినిమా చూస్తాడు. అలాగే సంతోషంగా  ఉన్నా కూడా సినిమా చూస్తాడు. కానీ అంతిమంగా ఒక ప్రేక్షకుడికి వినోదం కావాలి. వినోదంలో భాగంగా రకరకాల జోనర్ లో సినిమాలు తెరకెక్కుతుంటాయి. అన్ని జోనర్ లలో కామెడీ ప్రధానంగా వచ్చే సినిమాలు ఎక్కువ వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. కొన్ని సినిమాలయితే బ్లాక్ బస్టర్ లుగా మారి సినీ చరిత్రలో అలా నిలిచిపోతాయి. ఈ తరహాలో తెరకెక్కిన చిత్రం "భలే భలే మగాడివోయ్". ఈ సినిమా 2015 లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. దర్శకుడు మారుతి డైరెక్షన్ లో నాని, లావణ్య త్రిపాటి జంటగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డు క్రియేట్ చేసి కమర్షియల్ గా మంచి సక్సెస్ ను అందుకుంది.
 థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వి ఈ సినిమాని ఎంజాయ్ చేశారు. మురళి శర్మ, అజయ్, నరేష్, సితార,వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించి సినిమా విజయం సాధించడంలో భాగమయ్యారు. ఈ సినిమాలో హీరో నాని  విచిత్రమైన మతిమరుపు వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ లైన్ ముఖ్యంగా సినిమాకి ప్లస్ అయింది. నాని తన మతిమరుపు గురించి తాను ప్రేమించిన అమ్మాయి దగ్గర దాచడానికి చేసే ప్రయత్నంలో పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాలో హీరోకి ఫ్రెండ్ గా కనిపించిన వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే తన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. వీరిద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలలో కామెడీ చాలా బాగా వచ్చింది. ఎక్కడా బోర్ అనిపించకుండా ప్రతి క్యారెక్టర్ తోనూ కామెడీ పండించి వీక్షకులకి  ఫుల్ ఎంట్టైన్మెంట్ మీల్స్ అందించడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్ మారుతి.
 మతి మరుపు అనే మెయిన్ లైన్ చుట్టూ ప్రేమ కథను అల్లడం కొత్తగా అనిపించింది. ఫుల్ క్లీన్ కామెడీ చిత్రంగా ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. కేవలం ఏడు నెలల పిరియడ్ లో 7 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 55 కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబట్టి పక్కా కమర్షియల్ చిత్రంగా పేరు తెచ్చుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను అలరించింది. మ్యూజిక్ పరంగా కూడా ఈ మూవీ మంచి హిట్ టాక్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: