2006 జూన్ 23వ తేదీన విడుదలైన విక్రమార్కుడు సినిమా లో రవితేజ, అనుష్క, ప్రకాష్ రాజ్, అజయ్, తదితరులు అద్భుతమైన నటనా చాతుర్యాన్ని కనబరిచారు. ఎం.ఎం కీరవాణి అందించిన  సంగీతం రోమాలు నిక్క పొడిచేలా చేసింది. ఈ సినిమాలో రవితేజ అత్తిలి సత్తిబాబు అనే ఒక  చిన్న దొంగగా.. అలానే విక్రమ్ సింగ్ రాథోడ్ అనే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేశారు. ఆయన ఎక్స్ ట్రార్డినరీగా నటించి వావ్ అనిపించారు. జింతాత అంటూ రవితేజ చూపించిన ఓ మేనరిజం కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. అత్తిలి సత్తి బాబు పాత్ర పండించిన కామెడీ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు.

నిజానికి "విక్రమార్కుడు" రవితేజ కెరీర్ లో బెస్ట్ సినిమా గా నిలిచింది. ఇక సినిమా కథ గురించి మాట్లాడుకుంటే.. విక్రమ్ సింగ్ రాథోడ్ చంబల్ ప్రాంతంలో ఐపీఎస్ ఆఫీసర్ గా అడుగు పెడతారు. ఆ తర్వాత అక్కడ జరిగే ఆగడాలకు తనదైన శైలిలో కళ్లెం వేస్తారు. అయితే ఈ క్రమంలో గుండాలకు, విక్రమ్ సింగ్ రాథోడ్ కి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అయితే ప్రతినాయకుడి కొడుకు పోలీస్ బెల్ట్ కారణంగా చనిపోయే సన్నివేశానికి కీరవాణి అందించిన సంగీతం అద్భుతం అని చెప్పొచ్చు.

భయం గురించి విక్రమ్ సింగ్ రాథోడ్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను వెండితెరకు అతుక్కుపోయేలా చేసాయంటే అతిశయోక్తి కాదు. విక్రమ్ రాథోడ్ కుమార్తె కు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురి చేశాయి. సినిమా ఫస్ట్ హాఫ్ కడుపుబ్బా నవ్విస్తే.. సెకండ్ హాఫ్ భావోద్వేగానికి గురిచేస్తుంది. అయితే దిగ్గజ దర్శకుడు రాజమౌళి విక్రమార్కుడు సినిమాలో అన్ని రకాల ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా జోడించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.

ఈ చిత్రంలో అనుష్క శెట్టి కూడా చాలా బాగా నటించారు. ఆమె తన అందాలను విపరీతంగా ఆరబోస్తూ ప్రేక్షకులకు హీట్ ఎక్కించారు. ఇక మిగతా పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరూ నూటికి నూరు శాతం న్యాయం చేశారు. కీరవాణి స్వరపరచిన పాటలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. టాలీవుడ్ పరిశ్రమలో వచ్చిన బెస్ట్ పోలీస్ మూవీస్ లలో విక్రమార్కుడు టాప్ ప్లేస్ లో నిలుస్తుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: