బాలీవుడ్ స్టార్ హీరో చెల్లెలు ఏకంగా టాప్ లెస్ ఫొటోకు ఫోజిచ్చి ఆయన అభిమానులతో పాటు అందరికీ షాకిచ్చింది. బాలీవుడ్ లో సాధారణంగానే గ్లామర్ డోస్ ఎక్కువ. అయితే ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో లేని వాళ్లు కూడా తమ అందాలను చూపించడానికి ఏమాత్రం మొహమాట పడడం లేదు. గ్లామర్ షోతో బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోకుండా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. అందులో కృష్ణ ష్రాఫ్ ముందు వరుసలో ఉంటుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు, బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్. వీళ్లిద్దరికీ బీటౌన్ లో ఎంతటి ఆదరాభిమానాలు ఉన్నాయో కృష్ణ ష్రాఫ్ కు అంతకంటే ఎక్కువే క్రేజ్ ఉంది. సినిమాల్లో నటించకపోయినా ఆమె అందాల ఆరబోత మామూలుగా ఉండదు. ఎప్పుడూ బికినీల్లో ఉన్న పిక్స్ తో నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉంటుంది. కొంతమంది టైగర్ ష్రాఫ్ అభిమానులు తమ హీరో పరువు తీస్తోందని విమర్శించారు. వారికి కూడా గట్టిగానే సమాధానం చెప్పింది.

తాజాగా ఈ బ్యూటీ ఏకంగా టాప్ లెస్ పిక్ తో దర్శనమిచ్చి అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది. ఈ బోల్డ్ ఫోటోషూట్ నెట్టింట్లో వేడిని పెంచేస్తోంది. ఓ మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం కృష్ణ చేసిన ఈ హాట్ ఫోటోషూట్ వైరల్ అవుతోంది. ఆమె బ్లాక్ ఫాక్స్ లెదర్ ప్యాంటు, గ్లౌజులు ధరించింది. ఆమె నడుముపై ఉన్న పచ్చబొట్టు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తడిజుట్టుతో సెమీ బోల్డ్ లో.. ఆమె హాట్ నెస్ ను తట్టుకోవడం కష్టమే. స్టార్ హీరోయిన్లు సైతం అసూయపడే ఫిజిక్ ఆమె సొంతం మరి. ఈ స్టార్ డాటర్ ఫిట్నెస్ ఫ్రీక్. ఫిట్ నెస్ విషయంలో సోదరుడికి ఏమాత్రం తీసిపోదు. ఆమె 2018 సంవత్సరంలో ఎంఎంఏ మ్యాట్రిక్స్ అనే ఎంఎంఏ శిక్షణా కేంద్రాన్ని నడిపిస్తోంది. చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆమె అంతగా ఆసక్తి చూపకపోయినా ఫోటోషూట్‌లతో వేడిని పెంచుతోంది. అంతకుముందు ఆమె ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ఎబాన్ హైమ్స్ తో డేటింగ్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: