కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ అన్ని వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో మే నెల నుండి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్ని రిలీజ్ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. అల్లు అర్జున్ పుష్ప మొదట్లో ఆగష్టు 13న రిలీజ్ అని ప్రకటించారు కాని ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా వెల్లడించలేదు. అయితే బన్నీ పుష్ప రిలీజ్ డేట్ మీద వరుణ్ తేజ్ గని సినిమా రిలీజ్ ఆధారపడి ఉందని తెలుస్తుంది.

అదేంటి అంటే అల్లు అర్జున్ పుష్ప సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేస్తే గని సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేయాలని చూస్తున్నారు. లేదా పుష్ప డిసెంబర్ చివరి వారం అంటే క్రిస్ మస్ టైం లో రిలీజ్ ఎనౌన్స్ చేసినా గని సినిమాను డిసెంబర్ మొదటి వారం లో రిలీజ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు. కాని పుష్ప ఫైనల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయకపోవడంతో పుష్పతో పోటీ ఎందుకని వరుణ్ తేజ్ గని సినిమాను కూడా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయట్లేదు. వరుణ్ తేజ్ గని మూవీ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ స్పెషల్ గా బాక్సింగ్ నేర్చుకున్నాడు.

గని మీద వరుణ్ తేజ్ గురి పెట్టుకున్నాడని తెలుస్తుంది. అందుకే వేరే సినిమాలతో పోటీ కాకుండా సోలో గా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. వరుణ్ తేజ్ గని మూవీని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. మూవీలో వరుణ్ కు జోడీగా బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. గని మూవీలో వరుణ్ తేజ్ కోసం తమన్నా ఒక స్పెషల్ సాంగ్ కూడా చేస్తుందని తెలుస్తుంది. ఈ మూవీతో పాటుగా వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్ తో f3 మూవీ కూడా చేస్తున్నాడు. ఈ రెండు మూవీస్ తో వరుణ్ తేజ్ మరోసారి తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: