మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో... మంచు విష్ణు ఫైనల్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ పై భారీ విజయాన్ని సాధించింది మంచు విష్ణు ప్యానల్.  అయితే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ... టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో... ఆ వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఒకరిపై ఒకరు దూషిoచుకుంటున్నారు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు. అటు నిన్న ప్రకాష్ రాజు ప్యానల్ సభ్యులు... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఈ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదం మరింత రాజు కుంటోంది. 

మెగా ఫ్యామిలీ వర్సెస్ మోహన్ బాబు ఫ్యామిలీ లాగా... టాలీవుడ్ చిత్ర పరిశ్రమ చీలి పోయినట్లే కనిపిస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే... మార్క్ లిస్ట్ అసోసియేషన్ నుంచి మెగా వర్గం తప్పుకుంటుంది అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఒకవేళ ఇదే పరిస్థితి ఎదురైతే మన దేశ సినీ పరిశ్రమలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ యొక్క ప్రతిష్ట దారుణంగా దిగజారి పోవడమే కాకుండా దెబ్బతింటుంది. మాయని మచ్చగా మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మిగిలిపోతుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం వేర్వేరు అసోసియేషన్ అనే డిమాండ్లు ముందుకు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. వీటిపై తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఇలాంటి తరుణంలో... ఎన్నికల ముందు మంచు విష్ణు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోవడమే కాకుండా... ఆయన రెండేళ్ల పాటు కొనసాగడం కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే ఈ పరస్పర వివాదాల కారణంగా... బడా నటీనటులు బాగానే ఉన్నప్పటికీ... మామూలు కళాకారులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. వారికి చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: