టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ మధ్య హెల్దీ కాంపిటీషన్ లేకుండా రానురానూ పరిస్థితి దిగజారుతోందా ? అంటే... ఇండస్ట్రీలో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయో, ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొంతకాలం క్రితం దేవిశ్రీని తమన్ ఇన్సల్ట్ చేశాడంటూ ప్రచారం జరిగింది. ఆ విశేషం ఏమిటంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మహేష్-పరశురామ్ టీమ్ ఈ సినిమా కోసం ఇన్ ఫామ్‌లో ఉన్న ఎస్ఎస్ థమన్‌ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు.

అయితే అంతకన్నా ముందు 'సర్కారు వారి పాట' సంగీత దర్శకులపై పలు ఊహాగానాలు వచ్చాయి. అందులో దేవి శ్రీ ప్రసాద్, గోపీ సుందర్, తమన్ ఉన్నారు. గోపీ సుందర్ ను ఈ సినిమా కోసం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఇప్పటి వరకు టాప్ లీగ్ స్టార్ హీరోలకు చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించలేదు. ఈ కారణంగానే ఆయనకు మేకర్స్ ఓటు వేయలేదని తెలుస్తోంది. డీఎస్పీ, థమన్ మధ్య పోటీ నెలకొంది. డీఎస్పీ టాప్ లీగ్ మ్యూజిక్ డైరెక్టర్... అయితే ఈ మధ్య కాలంలో యావరేజ్ మ్యూజిక్ డెలివరీ చేయడంపై విమర్శలు వచ్చాయి. సంక్రాంతి రేసులో థమన్ ‘అల వైకుంఠపురంలో’కి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ‘సర్లేరు నీకెవ్వరు’తో తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా రాక్ స్టార్ యావరేజ్ స్టఫ్ తో నిరాశ చెందారు. మరోవైపు  థమన్ సంగీతంపై ప్రశంసలు కురిశాయి. ఇది సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

అయితే 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్లపై థమన్ చేసిన వ్యాఖ్యలు మహేష్ బాబు అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మహేష్ థమన్‌కి ఆమోదం తెలపడం లేదని చాలా మంది భావించారు. కానీ డీఎస్పీ కంటే టాప్ ఫామ్‌లో ఉన్న తమన్‌కి ఓటేశారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదలైన సమయంలో తమన్ చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. కానీ అందులో దేవిశ్రీ ప్రసాద్ ను చేర్చలేదు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం ఉంది అంటూ ప్రచారం జరిగింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: