నందమూరి నటసింహం బాలయ్య.. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ హిట్ మూవీ అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ తర్వాత అఖండతో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అఘోరాగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారనడంతో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ కూడా తన నటనతో, గ్లామర్ తో ప్రేక్షకులను అలరించింది. చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ విలనిజంతో కొత్త అవతారం ఎత్తి ప్రేక్షకుల విమర్శలు అందుకున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది.

ఈ సినిమాకి తమన్ మ్యూజిక్‌ అయితే థియేటర్లలో మోత మోగిస్తుందని ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ హక్కులను ఎవరు దక్కించుకున్నారు అనే అంశంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. అఖండ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుందని సమాచారం. ఈ సినిమా భారీ రేటుకే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగిందని తెలుస్తోంది.

అయితే ఈ మూవీతో హాట్ స్టార్ కచ్చితంగా జాక్ పాట్ కొట్టినట్లే అంటూ ఓటీటీ విశ్లేషకులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా బాలయ్య దూసుకెళ్తున్నారు. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడానికి ఇంకా చాలా రోజులు సమయం ఉందని.. సినిమా బాగుండడంతో నెటిజన్లు ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: