నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఆన్ ఇండియా మూవీ అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదల అయి రెండు రోజులు పూర్తి చేసుకొని 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య నటనను చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అంతులేకుండా పోయింది. అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం 'అఖండ' ప్రభంజనం సృష్టిస్తోంది.

 అయితే  బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సైతం అఖండ సినిమా గురించి వెయిట్ చేయడమే కాకుండా సినిమా కలెక్షన్ల గురించి కూడా తెలిపారు. అయితే విడుదలైన రెండు రోజులకే ఈ సినిమా 50 కోట్ల రాబట్టింది.... ఇక శని ఆదివారాల్లో ఎక్కువ కలెక్షన్ పెరిగే అవకాశం ఉందని ఈ సినిమా 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది అని చెప్పుకొచ్చారు చిత్ర బృందం. కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు పెండింగ్ లో పడ్డాయి. ఈ మహమ్మారి తర్వాత థియేటర్లలో విడుదలైన మొట్టమొదటి స్టార్ హీరో  సినిమా ఇది. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేట్లు భారీ స్థాయిలో అన్న సంగతి మనందరికీ తెలిసిందే అయినప్పటికీ చిత్రబృందం ఏమాత్రం వెనకడుగు వేయకుండా అనుకున్న డేట్ కి సినిమాను విడుదల చేశారు.

బాలయ్య హీరోగా నటించిన ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా రిజల్ట్ ఎలా వస్తుందని చిత్ర బృందంతో పాటు బాలయ్య అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూశారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది దీనితో బాలయ్య ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ కి కూడా బాలయ్య ఊపిరి పోసినట్లయింది. బాలయ్య నటించిన కన్నడ సినిమాతో ఇప్పుడు స్టార్ హీరోలందరూ బాలయ్య బాటలోనే నడవాలని అనుకుంటున్నారు.ఈ సినిమాకి రవిందర్ రెడ్డి నిర్మించగా..థమన్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం అఖండ సినిమా ప్రభావం టాలీవుడ్ పై ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: