మలయాళంలో పేరు ప్రఖ్యాతులు పొందిన హీరో మోహన్ లాల్. తాజాగా ఆయన నటించిన పిరియాడిక్ మూవీ.."మరక్కర్" ఈ సినిమా కేరళ ఇండస్ట్రీలోని ఎంతో ఘనంగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ నే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి రోజే ఆరు కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక ఈ సినిమా ఆ తర్వాత కలెక్షన్లను నెమ్మదిగా వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందొ చూద్దాం ఇది కేవలం కేరళలోని కలెక్షన్స్.

1). మొదటిరోజు..6.92 కోట్ల రూపాయలు రాబట్టింది.
2). రెండవ రోజు..3.31 కోట్ల రూపాయలు
3). మూడవరోజు 4.33 కోట్ల రూపాయలు
4). నాలుగో రోజు..4.61 కోట్ల రూపాయలు.

మొత్తం మీద..19.17 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి లోని విడుదలకు సిద్ధమైంది కానీ కరోనా కారణం చేత.. వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఆ తర్వాత ఆగస్టు 12వ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదట. డిసెంబర్ 2 వ తేదీన విడుదల తేదీని ప్రకటించారు.ఈ మూవీ విడుదల కాకముందే..67 వ జాతీయ చలన చిత్రంనికీ ఎంపికయింది. అంతేకాకుండా అందులోనే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్స్, స్పెషల్ ఎఫెక్ట్.. ఈ విభాగంలో కూడా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఇక అంతే కాకుండా కేరళలో 50 వ ఫిలిం ఫేర్ అవార్డులో స్పెషల్ జ్యూరీ అవార్డును సొంతం చేసుకుంది.


ఈ సినిమాను 100 కోట్లతో తెరకెక్కించడం జరిగింది. ఇదంతా మోహన్ లాల్ కి ఉన్న క్రేజ్ వల్లే సాధ్యమైందని కొంతమంది నెటిజన్స్ తెలియజేస్తున్నారు. ఆయన సొంత భాషలో సినిమాలు చేస్తూ.. ఇతర భాషలలో సైతం అభిమానులను కూడా సంపాదించారు. అందుచేతనే ఆయన ఉత్తమ నటుడిగా ఎదిగిపోయాడు మోహన్ లాల్. ఇతర భాషల్లో సైతం రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: