మెగా స్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి సొంత కృషితో తనకంటూ కీర్తి, ప్రతిష్టలను చాటిచూపాడు రామ్ చరణ్ తేజ్. తెలుగులోనే కాదు పలు రకాల భాషల్లోనూ ఈ హీరో క్రేజ్ మామూలుగా లేదు. పాత్ర ఏదైనా పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. చిట్టి బాబు పాత్ర నుండి గోవిందుడు అందరివాడు అమెరికా అబ్బాయి పాత్ర వరకు రోల్ ఏదైనా తనదైన శైలిలో నటించి మెప్పిస్తాడు. అతడి కృషి, పట్టుదల నేడు అతడిని ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబెట్టాయి. అయితే చెర్రీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన పర్మిషన్ తో ఆ సినిమాలో నటించాను అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ సినిమా ఎంటి డైరెక్టర్ ఎవరు అన్న వివరాలు చూస్తే..

తాజాగా  ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఓ వైపు చెర్రీ ట్రిపుల్ ఆర్ లో చేస్తుండగా... మరో వైపు తండ్రి ప్రధాన పాత్రలో చేస్తున్న ఆచార్య సినిమాలో కీలక రోల్ కు ఎవరిని సెలెక్ట్ చెయ్యాలా అన్న టెన్షన్ మొదలయ్యింది అట. ఎవరిని అనుకున్నా కుదరడం లేదు. ఇక ఆ పాత్ర చూస్తే తాను చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ కానీ మరో వైపు అప్పటికే జక్కన్నతో ట్రిపుల్ ఆర్ మూవీతో టైట్ షెడ్యుల్ అయితే ఆచార్య సినిమాలో నక్సలైట్ పాత్రలో చేసేందుకు దర్శకుడు రాజమౌళిని అడిగారట చెర్రీ.


అయితే జక్కన్న బాగా ఆలోచించి గో ఏ హెడ్ అన్నారట, చెర్రీపై తనకు అంత నమ్మకం తన షెడ్యుల్ ను మేనేజ్ చేయగలడు అని..అయితే ఇదే అంశాన్ని ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు రామ్ చరణ్. అలా రాజమౌళి గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఆచార్య సినిమాలో చేశాను అని ఆయన అన్నారు. అలా ఒక చిన్న పాత్రగా అనుకున్న ఆచార్య కి సిద్ధ పాత్ర... పూర్తి స్థాయి పాత్రగా మార్చేశారు కొరటాల శివ. ఇప్పుడు ఈ సినిమా కోసం మెగా అభిమానులు అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: