ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైనా కొత్త పోస్టర్‌తో విషెష్‌ చెబుతారేమో అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పెద్ద షాక్‌ ఇచ్చింది.ఇక సినిమా పోస్టర్‌ సంగతి పక్కనపెడితే ఏకంగా సినిమానే వాయిదా అంటూ ప్రకటన ఇచ్చి మెగా ఫ్యాన్స్ కి షాక్‌కి గురి చేసింది. ఫిబ్రవరి 4 వ తేదీన 'ఆచార్య' సినిమా రావడం లేదు అంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అంతేకాదు కొత్త డేట్‌ ఎప్పుడా అనేది కూడా ప్రకటించలేదు. దీంతో ఒక్కసారి మెగా అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే ఒక రోజు గ్యాప్‌లో ఆచార్య టీం నిరుత్సాహాన్ని చెరిపేసింది. ఇక సినిమా కొత్త డేట్‌ ని ప్రకటించేసింది.'ఆచార్య' సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తాం అంటూ కొత్త తేదీని కనుమ శుభాకాంక్షలతో తెలియజేసింది సినిమా యూనిట్. దీంతో విడుదల తేదీ తెలియక ఆందోళన పడుతున్న ఫ్యాన్స్‌కు ఊపిరి వచ్చినట్లయింది. అంటే సుమారు రెండు నెలల పాటు సినిమాను వాయిదా వేశారు చిత్ర బృందం వారు.

అప్పటికి కరోనా మహమ్మారి పరిస్థితులు కుదుట పడొచ్చని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆ తేదీని ఎంచుకున్నారు. ఇక అంతేకాదు ఆ రోజు సినిమా ఉగాది పర్వదినం నేపథ్యంలో వస్తుంది. కాబట్టి వసూళ్లు కూడా బాగుంటాయని చిత్రబృందం భావించిందని సమాచారం తెలుస్తుంది.ఇక టాలీవుడ్ సూపర్ మహేష్‌ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమను కూడా అదే రోజు విడుదల చేస్తామని చిత్రబృందం గతంలోనే ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పుడు 'ఆచార్య' సినిమా ఆ తేదీన వస్తుండటంతో సూపర్ స్టార్ మహేష్‌బాబు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మెగా హీరోలు కావాలనే మహేష్ ని టార్గెట్ చేసి ఫ్యాన్ వార్స్ మళ్ళీ రేపుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఒక పక్క మహేష్ బాబు ఫ్యాన్ వార్స్ ఆపాలని అందరి హీరోస్ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటే, ఈ మెగా హీరోలు మాత్రం ఇండైరెక్ట్ గా కావాలనే మహేష్ ని టార్గెట్ చేసి ఫ్యాన్ వార్స్ కి కారణమవుతున్నారని నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతూ మెగా హీరోలను ట్రోల్ చేస్తూ ఒక ఆట ఆడుకుంటున్నారు. అంతకముందు కూడా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలానే మహేష్ ని టార్గెట్ చేశారు.ఇక సర్కారు వారి పాట సినిమా సినిమా విషయానికి వస్తే.. మేజర్‌ పార్ట్‌ షూటింగ్ బ్యాలెన్స్‌ ఉంది. ఇక ఇప్పట్లో షూటింగ్‌లు జరిగే పరిస్థితి లేకపోవడంతో పైగా మహేష్ కి కరోనా వచ్చి మళ్ళీ కోలుకోవడంతో సినిమా షూటింగ్ పెండింగ్ లో వుంది. మహేష్ కొంచెం రెస్ట్ తీసుకున్నాక మిగతా భాగం పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: