తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో అల్లు అర్జున్ ఒక విభిన్నమైన స్టార్ హీరో అని చెప్పవచ్చు. తను ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తూ ఉంటాడు. ప్రస్తుతం స్టార్ హీరోలలో ఈయన కూడా ఒకరు. ఇక సినీ ఇండస్ట్రీలో ఉండి ఎంతో మంది హీరోలతో స్నేహంగా వ్యవహరిస్తూ ఉంటాడు అల్లు అర్జున్. అల్లుఅర్జున్ కొందరు ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్, మరి కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ ఇలా చాలామంది ఉన్నారు. ఇకపోతే హీరో నవదీప్ అల్లు అర్జున్ కి చాలా కాలం నుంచి మంచి మిత్రుడు.


ఆర్య-2  చిత్రంలో ఇద్దరు కలిసి నటించారు కూడా. అల్లు అర్జున్ ని బావ అని పిలిచెంత సన్నిహిత్యం నవదీప్ కు ఉన్నది. అతనికి ఇప్పుడు అల్లు అర్జున్ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ అందింది అందుకు సంబంధించిన ఒక ఫోటో ని కూడా నవదీప్ షేర్ చేయడంతో ఆ ఫోటో చాలా వైరల్గా మారుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇచ్చిన బహుమతి ఇదే.. అందుకే నవదీప్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు ప్రేమకు అవధులు లేనప్పుడు బహుమతులు సందర్భానుసారంగా వస్తూ ఉంటాయని అందుకోసం అల్లు అర్జున్ ఎప్పుడు తనకు మంచి మిత్రుడు అని తెలియజేశాడు నవదీప్.ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్తో ఎయిర్ పొడ్స్ వాడుతాను అని ఎమోషనల్ అయ్యారు. కెరీర్ విషయానికి వస్తే హీరో నవదీప్ ప్రస్తుతం అవనీంద్ర డైరెక్షన్లో లవ్ మౌళి అనే చిత్రంలో నటిస్తున్నాడు త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది ఇటీవల కాలంలో తన కెరియర్ గ్రాఫ్ ను చక్కదిద్దుకునే విధంగా హీరో నవదీప్ ప్రయత్నిస్తున్నాడు. ఇక తనకు ఏదైనా పాత్ర నచ్చితే ఇతర హీరోల సినిమాలలో కూడా తన ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తూ ఉంటాడు నవదీప్. అయితే ప్రస్తుతం పుష్ప-2 లో నటిస్తున్న అల్లు అర్జున్ ఏదైనా పాత్రని కల్పిస్తాడేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: