టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. విక్టరీ వెంకటేష్ యాక్షన్ మూవీ లలో, కమర్షియల్ మూవీలలో నటించినప్పటికీ ఎక్కువ శాతం కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ప్రేక్షకులలో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  అలాంటి విక్టరీ వెంకటేష్ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమాలో  హీరోగా నటించాడు.

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది.  అందులో భాగంగా చిత్ర బృందం లోని సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో  పాల్గొంటూ ఆఫ్ 3 మూవీ ని జనాల్లోకి తీసుకువెళ్తున్నారు.  

ఇది ఇలా ఉంటే తాజాగా ఎఫ్ 3 సినిమా గురించి విక్టరీ వెంకటేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  విక్టరీ వెంకటేష్... ఎఫ్ 2 మూవీ తర్వాత ఇలాంటి అవుట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మూవీ ఇప్పటి వరకు రాలేదు. ఎఫ్ 3 మూవీ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో ఒకటిగా నిలబడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు అని చెప్పి ఎఫ్ 3 సినిమాపై తనకున్న నమ్మకాన్ని తాజాగా తెలియజేశాడు.  మరి ఎఫ్ 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: