మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమన్నా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తెలుగు నాట ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ప్రస్తుతం కూడా తమన్నా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి , వెంకటేష్ లాంటి హీరోల సరసన నటిస్తూ అలాగే ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ తన కెరీర్ ను ఫుల్ జోష్ లో కొనసాగిస్తుంది .

తమన్నా ప్రస్తుతం తెలుగు సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే మిల్కీ బ్యూటీ తమన్నా , చిరంజీవి హీరోగా నటించింస్ సైరా నరసింహారెడ్డి మూవీ లో  హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో భోళా శంకర్  రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ అనేక ఆసక్తికరమైన విషయాలకు సమాధానాలు ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మిల్కీ బ్యూటీ తమన్నా కు మీరు చేసిన పాత్రలలో ఏ పాత్ర మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు తమన్నా సమాధానం ఇస్తూ... ఎఫ్ 3 మూవీ లో అబ్బాయిల నటించడం చాలా కష్టం అనిపించింది.  

కాకపోతే ఆ పాత్రను చాలా ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ నటించాను అని తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా ఎఫ్ 3 మూవీ లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: