నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా,  నిర్మాతగా సినిమాల్లో నటిస్తూ... నిర్మిస్తూ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును తెచ్చుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇలా హీరో గా , ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా మల్లాడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే .

మూవీ లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో మనకు కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , ఆ ప్రచార చిత్రాలను బట్టి చూస్తే కళ్యాణ్ రామ్ రెండు పాత్రలలో కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించడం దాదాపు కన్ఫామ్ గా కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ  మూవీ ని ఫుల్ గా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా కళ్యాణ్ రామ్ తన నిర్మాణ సంస్థలో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.  తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కళ్యాణ్ మాట్లాడుతూ ... ఆర్ ఆర్ ఆర్ లాంటి  ప్రతిష్టాత్మక మూవీ తో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప గుర్తింపుని సంపాదించుకున్నాడు. దానితో తనతో  చేయబోయే తదుపరి మూవీ అందరి అంచనాలను అందుకునేలా ఎంతో భారీ స్థాయిలో ఉండాలి అని ప్లాన్ చేస్తున్నామని, అందుకే అది కాస్త  ఆలస్యం అవుతోందని తాజా ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: