ఈ వారం టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ఇద్దరు యువకులు ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని చేసిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హోరాహోరీగా తలబడబోతున్నాయి. ఆ విధంగా వీరిద్దరిలో ఎవరు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించి గెలుపును సాధిస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యువ హీరోగా తన సత్తా చాటుతూ ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చిన నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకు రుణమా కట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

మాస్ మాసాల సినిమాగా ఈ చిత్రం తప్పకుండా తనకు మాస్ ఇమేజ్ను ఈ చిత్రం తెచ్చిపెడుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆ విధంగా ఇప్పటికే పలు అప్డేట్లతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరచుకున్న నితిన్ తప్పకుండా తన సినిమాతో గొప్ప విజయం అందుకోగలను అనుకుంటున్నాడు. అయితే అనూహ్యంగా ఆ తర్వాత రోజున మరొక హీరో సినిమా విడుదల అవడం ఆయనకు కొంత మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హ్యాపీ డేస్ సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిఖిల్ ఆ తరువాత పలు సినిమాలతో అందరిని అలరించాడు ఆ విధంగా ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో ఆయన మరొకసారి అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ కీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని పలుమార్లు వాయిదా వేసుకున్న నిఖిల్ ఇప్పుడు 13వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతుండడం విశేషం. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. గతవారం వచ్చిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ విజయాలు అందుకోగా ఈవారం కూడా ఈ చిత్రాలు విజయాలు అందుకో అనేది చూడాలి. నితిన్ మరియు నిఖిల్ ఇద్దరు కూడా తమ తమ సినిమాల పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అదే సమయంలో ఎంతో నమ్మకంగా కూడా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: