విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లైగర్’ రిలీజ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఈనెల చివరి భాగంలో విడుదల కాబోతున్న ఈమూవీని ఒక నెల రోజుల నుండి ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో విజయ్ కు క్రేజ్ ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలను పక్కనపెట్టి ఉత్తరాది అంతా ఈమూవీని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈమధ్య ముంబాయిలో విజయ్ అనన్యా పాండే లు లోకల్ టైన్ ఎక్కి అందర్నీ పలకరిస్తూ ఈమూవీ ప్రమోషన్ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు గుజరాత్ రాష్ట్రానికి వచ్చి విజయ్ వదోద్రా పట్టణంలో కలయ తిరుగుతూ ఈమూవీని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆ పట్టణంలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ కు వెళ్ళి అక్కడ ఆ హోటల్ స్పెషాలిటీ అయిన గుజరాతీ తాళీ ని చాల ఆతృతగా తిన్నాడట. 27 రకాల గుజరాతీ వంటకాలతో ఉన్న ఆ తాళీ తిన్న తరువాత తనకు బద్ధకంగా ఉంది అంటూ విజయ్ ఒక పోస్ట్ చేసాడు.అంతేకాదు ఆ హోటల్ లో భోజనం చాల బాగుంది అంటూ అందర్నీ గుజరాత్ లోని వదోద్రా వచ్చి ఆ భారీ భోజనం చేయమంటున్నాడు. ప్రస్తుతం విజయ్ క్షణం తీరిక లేకుండా ఈమూవీ ప్రమోట్ చేస్తున్నాడు. త్వరలోనే దక్షిణాది రాష్ట్రాలలో ఈమూవీ ప్రమోషన్ కోసం విజయ్ అనన్యా పాండే లు చెన్నై బెంగుళూరు త్రివేండ్రం హైదరాబాద్ రాబోతున్నారు.ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నప్పటికీ మరొక వైపు ఈమూవీ పై కొన్ని సందేహాలు కూడ కొందరికి కల్గుతున్నాయి. భారీ యాక్షన్ సీన్స్ తో నిండిపోయిన ఈమూవీలో కథ అంత వెరైటీగా ఉండదని ఈమూవీ చూసే ప్రేక్షకులకు పూరీజగన్నాథ్ గతంలో తీసిన ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’ స్టోరీ లైన్ గుర్తుకు వస్తుంది అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలు పూరీజగన్నాథ్ ఖండిస్తూ ఇది వెరైటీ కథ అంటున్నాడు..మరింత సమాచారం తెలుసుకోండి: