ఆర్ ఆర్ ఆర్ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న
హీరో ఎన్టీఆర్. ఇప్పుడు తన తదుపరి
సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఈ హీరో. చాలా రోజులుగా ఆయన
కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఎంతకీ ఈ
సినిమా మొదలు కాకపోవడం ఆయన అభిమానులను కొంత ఆగ్రహ పరుస్తుంది. అయితే పలు కారణాలవల్ల ఈ
సినిమా మొదలు కాకపోవడం జరుగుతుంది అనే వివరణ చిత్ర బృందం ఇస్తుంది. కాగా ఆయనతో
సినిమా చేయడానికి ఎదురుచూస్తున్న దర్శకుల జాబితా రోజు రోజుకీ పెరిగిపోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆయన ఇద్దరు దర్శకులతో
సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఒకటి
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన ఒక
సినిమా చేయబోతుండగా ఇంకొకటి బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఆయన మరొక
సినిమా చేయబోతున్నాడు. ఆ విధంగా ఈ మూడు సినిమాలతో బిజీగా ఉన్న
ఎన్టీఆర్ ఆ తర్వాత మరికొంతమంది దర్శకుల కథలను వినడం విశేషం. వారిలో కొంతమంది
బాలీవుడ్ చిత్ర దర్శకులు కూడా ఉన్నారు. ఈ మూడు సినిమాలను వచ్చే ఏడాదిలో పూర్తి చేసి ఆ తర్వాత వచ్చే ఏడాది మిగతా దర్శకులతో
సినిమా చేసే విధంగా ఆయన ప్లాన్ చేశాడు.
మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో రూపొంది భారీ విజయాలను అందుకుంటాయో చూడాలి.
కొరటాల శివ దర్శకత్వంలోని సినిమాను వచ్చే నెలలో మొదలుపెట్టడానికి సిద్ధమవుతుంది చిత్ర బృందం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ
సినిమా పొలిటికల్ గా రూపొందుతుంది అని చెబుతున్నారు. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్
సినిమా భారీ విజయాన్ని అందుకోగా ఈ చిత్రం అంతకుమించి ఉండే విధంగా వారు ప్రణాలికలు రచిస్తున్నారు. మరి ఈ చిత్రం ద్వారా వరుసగా రెండవ విజయాన్ని వీరు తమ ఖాతాలో వేసుకుంటారా అనేది చూడాలి.