ఇండియాలోనే గ్రేట్ డైరెక్టర్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో గొప్ప గొప్ప మూవీ లకు దర్శకత్వం వహించి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది.

మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి , ఐశ్వర్య రాయ్ ,  త్రిష వంటి హేమ హేమీలు అయిన నటీనటులు నటించగా ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ లోని సభ్యులు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ దర్శకుడు మణిరత్నం కూడా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా మణిరత్నం కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ ...  పొన్నియన్ సెల్వన్ మూవీ షూటింగ్ లో భాగంగా ఐశ్వర్య రాయ్ ,  త్రిష లతో కాస్త ఇబ్బంది పడ్డాను అని చెప్పు కొచ్చాడు. ఐశ్వర్యా రాయ్ ,  త్రిష మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సీరియస్ గా ఉంటాయి. అయితే వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా సీరియస్ నెస్ వచ్చేది కాదు. దానితో చాలా సమయం పట్టేది. సెట్స్ లో కూడా చాలా కష్టపడాల్సి వచ్చేది. దానితో వారిద్దరిని మాట్లాడుకోవద్దు అని వర్నింగ్ ఇచ్చా. అలాగే కొన్ని సార్లు కోప్పడాల్సి కూడా వచ్చింది అని మణిరత్నం పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: