సాధారణంగా పండుగ సీజన్ వచ్చిందంటే చాలు అటు సినీ ప్రేక్షకులకు నిజమైన పండుగ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా ఒకే సారీ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలవుతూ ఉంటాయి. దీంతో మీకు అందరు హీరోలు అభిమానులు థియేటర్ల వద్దకు వచ్చి చేసే సందడి అంతా ఇంత కాదు అని చెప్పాలి. ఇక పెద్దపెద్ద సినిమాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న నేపథంలో సినీ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు దసరా కానుకగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమాలు ఫ్లాష్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఇలాంటి సమయంలోనే మరో చిన్న సినిమా స్వాతిముత్యం కూడా ప్రేక్షకులను మనసులు గెలుచుకునేందుకు సిద్ధమైంది అని చెప్పాలి.


 ఇక దసరా ముగిసిన వెంటనే అటు దీపావళికి సినిమాలు విడుదలయ్యేందుకు అంత సిద్ధం చేసుకుంటూ ఉంటారు చిత్ర బృందం. ఇక దీపావళి పండక్కి మెగాస్టార్, ప్రభాస్, విజయ్ లాంటి స్టార్ హీరోలు సినిమాలు ఫిక్స్ అయ్యాయి అని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆది పురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆది పురుష్ రిలీజ్ డేట్  రోజునే దళపతి విజయ్ నటిస్తున్న వరిసు సినిమా రిలీజ్ డేట్ ని నిర్మాత దిల్ రాజు లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది కావాలని ఫిక్స్ చేసినట్లు కూడా గాసిప్స్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.


 ఎందుకంటే సాధారణంగా ప్రభాస్ సినిమాకు ఎదురు వెళ్ళాలని ఎవరు అనుకోరు. కానీ ఇటీవల ఆది పురుష్ టీజర్ బయటికి వచ్చిన తర్వాత బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమాలో అనుకున్న రేంజ్ లో విజువల్స్ లేవు అంటూ ఎంతోమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఇక పక్కా ప్లాన్ చేసిన దిల్ రాజు అదే రోజు విజయ్ సినిమా ఫిక్స్ చేస్తే ఇక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టవచ్చు అని ప్లాన్ చేసాడట. కాగా ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. తమన్ సంగీతం వహిస్తుండగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: