టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి పేరు సంపాదించుకున్నాడు మన పూరీ జగన్నాథ్.


ఇడియట్, బిజినెస్ మాన్, పోకిరి, నేనింతే వంటి మాస్ సినిమాలను తెరకెక్కించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. చాలా వరకు స్టార్ హీరోల సినిమాలనే తెరకెక్కించాడు. కొన్ని కొన్ని సార్లు ఫ్లాపులను కూడా ఎదుర్కొన్నాడు పూరీ. అయినా కూడా తన సహనాన్ని కోల్పోకుండా ముందడుగు వేసి మరి సినిమాలను రూపొందిస్తున్నాడట.ఇక ఇటీవలే యంగ్ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాతో ముందుకు వచ్చాడు.


భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపొందింది. కానీ విడుదలైన మొదటి రోజే ఈ సినిమా ప్లాప్ అని ముద్ర వేసుకుంది. దీంతో ఇదే దేవరకొండ తో పాటు పూరి జగన్నాథ్ కు సోషల్ మీడియాలో బాగా నెగటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. ఎందుకంటే సినిమా విడుదల కాకముందుకు ఈ సినిమా గురించి జోరుగా ప్రచారాలు అయితే చేశారు. పైగా విజయ్ దేవరకొండ మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొట్టి సినిమాపై మరింత అంచనాలు అయితే పెంచాడు. కానీ ఏముంది.. సినిమా విడుదలైన రోజే ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇదంతా పక్కన పెడితే పూరీ ఈ సినిమా డిజాస్టర్ అని టాక్ వచ్చినా కూడా ఎక్కడ నిరాశ చెందకుండా నెక్స్ట్ సినిమాకు రెడీ అయ్యాడని తెలుస్తుంది.


ఇప్పటికే ఆయన ఖాతాలో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' సినిమా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు పూరీ ఒక దర్శకుడుగా మాత్రమే మనందరికీ పరిచయం. కానీ ఆయనలో మరో యాంగిల్ కూడా ఉంది. అదేంటో కాదు ఆయన నటుడుగా కూడా తనేంటో నిరూపించుకున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. డాక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కాగా బ్లాక్ బస్టర్ హిట్ కాలేకపోయింది. అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటీనటులు నటించారో అన్న సంగతి తెలిసిందే. అయితే తొలిసారిగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఈ సినిమాలో ఒక పాత్రలో నటించాడట.. పూరీ జగన్నాథ్ ఇందులో రిపోర్టర్ పాత్రలో కనిపించగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడానికి వస్తాడు. అయితే ఆ పాత్రలో పూరి బాగా అదరగొట్టాడు. థియేటర్లో పూరి జగన్నాథ్ సీన్ రావడంతో అందరూ ఓ రేంజ్ లో గెంతులు వేశారట.దీంతో ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు పూరి నటనను మెచ్చుకొని ఇంతకాలం ఈ నటనను ఎక్కడ దాచావు భయ్యా అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలో మంచి డైరెక్టరే కాదు మంచి నటుడు కూడా ఉన్నాడు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: