తాజాగా అడివి శేషు హీరోగా నటించిన హిట్ 2 సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే .శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా లో విశ్వక్ సేన్ హిట్ 1 లో  హీరోగా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. దీని అనంతరం హిట్ 3 సినిమా కూడా ఉండబోతుంది అంటూ చిత్ర బృందం చెప్పడం జరిగింది. అయితే నాచురల్ స్టార్ నాని హిట్3  సినిమాలో అర్జున్ సర్కార్ అనే ఒక బృటల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు .అయితే ఈ సినిమా చూసిన ఒక లేడీ అభిమాని ఈ సినిమాలో విలన్ గా ఎవరు ఉంటే బావుంటుంది

 అనే దానిపై ఒక షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఆ అమ్మాయి మాట్లాడుతూ హిట్ 3 లో  కచ్చితంగా విలన్ గా ఒక సైకో లేడి ఉంటే బాగుంటుంది అని ఒకవేళ మీరు లేడీ విలన్ ని గనక పెట్టకపోతే ఆ మహేష్ ని నేనే వచ్చి చంపేస్తా... ఇక ఆ లేడీ సైకో కిల్లర్ గా  నేనే ఆ పేరును తెచ్చుకుంటా అంటూ నవ్వుతూ ఆ  అభిమాని నానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ అమ్మాయి ఇచ్చిన ఈ ఫన్నీ వార్నింగ్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన కొందరు సినిమాలో అడవి శేషు ఈ అమ్మాయి ఒకవేళ చంపిన చంపేస్తుంది

 ఆమె అంటున్న ఆ లేడీ కిల్లర్ ని  పెట్టేయండి అంటూ సరదా సరదాగా రిప్లైలు కూడా పెట్టడం జరుగుతుంది .అంతే కాదు మరి కొందరు అసలు ఈ మహేష్ ఎవరు అని అంటున్నారు .ఇక ఆ అమ్మాయి ఈ వీడియోలో భాగంగా మహేష్ ని నేనే చంపేస్తా అంటూ వార్నింగ్ ఇవ్వడంతో మహేష్ ఎవరు అనే ప్రశ్న అందరిలో నెలకొంది. ఇదిలా ఉంటే ఇక మరికొందరేమో హిట్ 3 లో నాని అస్సలు సెట్ కాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి .మరికొందరు మాత్రం నాని ఇలాంటి క్యారెక్టర్ లో  ఎలా కనిపిస్తాడు ఎలా యాక్టింగ్ చేస్తాడు అనేది చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక హిట్  1,2,3  తో పాటు ఈ సినిమాకి సంబంధించి 7 సీక్వెల్స్ తీస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే.  దీంతో ఈ లేడీ అభిమాని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: