బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటులలో సంజయ్ దత్ కూడా ఒకరు.. మున్నాభాయ్ సిరీస్ తో మంచి పాపులర్ ని సంపాదించుకున్న సంజయ్ దత్ బాలీవుడ్ ఆడియన్స్ ను మేప్పించారు.. హీరోగా తనకేరియర్లో ఎన్నో విజయాలను అందుకున్న సంజయ్ దత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి మరి పలు రకాల డిఫరెంట్ పాత్రలలో నటిస్తూ ఉన్నారు..kgf -2 లో అదిరా పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన సంజయ్ దత్ సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.


సినిమా తరువాత సౌత్ దర్శకులకు సంజయ్ దత్ రూపంలో ఒక మంచి విలన్ గా దొరికేశారు అని చెప్పవచ్చు. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు విజయ్ దళపతి కాంబినేషన్లో వస్తున్న లియో సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ దాస్ అనే రోల్ లో సంజయ్ దత్ కనిపించబోతున్నారు. దసరాకి ఈ సినిమా విడుదల కాబోతున్నది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు చిత్రంలో విలన్  పాత్రకు ఎంత ప్రియరిటి ఉంటాయో గత చిత్రాలలో చూస్తే మనకు అర్థమవుతుంది. దీంతో సంజయ్ దత్ కూడా ఈసారి కచ్చితంగా దక్షిణాది భారతీయ చిత్రాలలో విలన్కు టాప్ చాయస్ గా మారుతారని చెప్పవచ్చు.


ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్  చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు సంజయ్ దత్. నాగార్జున నటించిన గత చిత్రాలలో కూడా సంజయ్ తెలుగులో గెస్ట్ రోల్ లో కనిపించారట. మరల ఇప్పుడు ఇలా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ని ఢీకొట్టే పాత్రలో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాలన్నీ తెరకెక్కించడం జరిగింది. దీంతో మరికొన్ని సినిమాలలో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది ఇవన్నీ కూడా భాను ఇండియా రేంజ్ లో సినిమాలే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: