తాజాగా ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియో సమర్పణ లో సుప్రియ నిర్మించబోతోంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ డైలాగులు కూడా హిందీతో పాటు తెలుగులో కూడా చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే వివరాలను కూడా తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది చిత్ర బృందం. డైరెక్టర్ షనిల్ మొదటిసారి లైలా అనే ఒక షార్ట్ ఫిలిం సైతం డైరెక్షన్ చేశారట. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కు ఈ షార్ట్ ఫిలిం ని అధికారికంగా ఎంపిక చేయడం జరిగిందట. అయితే ఈ పాన్ ఇండియా చిత్రానికి అడవి శేషు షనిల్ ఇద్దరు కలిసి కూడా స్టోరీస్ స్క్రిప్ట్ ఇతరత్రా వాటిని చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలోని పాత్రలో టైటిల్ ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.. ఈ సినిమా ని ఈ ఏడాది సినిమా షూటింగ్ సెట్ పైన తీసుకువెళ్లెందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అడవి శేషు గూడచారి-2 సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డారు గతంలో వచ్చిన గూడచారి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సీక్వెల్ పైన మరింత ఆసక్తి పెంచేస్తోంది. ఈ సినిమా కోసం దాదాపుగా 5 అంతస్తుల గాజు మేడం సైతం సిద్ధం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ కూడా ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి