సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ లో ధనుష్ ఒకరు. నటుడిగానే కాకుండా ఈయన నేపథ్య గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ తన రాబోయే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం `కుబేర` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాలో ధనుష్‌, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 20న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.


తాజాగా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళిఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  ధనుష్, ర‌ష్మిక‌, నాగార్జున‌ మరియు రాజమౌళిలతో యాంకర్ సుమ చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే `తమిళంలో మీరు ప‌లు సినిమాలను డైరెక్టర్ చేశారు.. మ‌రి తెలుగులో ఛాన్స్ వస్తే ఏ హీరోతో సినిమా చేస్తారు?` అని సుమ ప్రశ్నించగా.. ధనుష్ మరో ఆలోచన లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పేశారు.


ఆ మాట వినగానే పవన్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు. నిజంగా ధనుష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా సెట్ అయితే బాక్సాఫీస్ బద్దలే అని సినీ ప్రియులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో సుమ ధనుష్ ను మరికొన్ని ప్రశ్నలు అడిగింది. డబ్బు లేకపోయినా దక్కేది ఏంటనగా.. అమ్మ ప్రేమ అని ధనుష్ సమాధానం ఇచ్చారు. `మీకు కూడా ఒకటో తారీకు కష్టాలు ఉంటాయా?` అని ప్ర‌శ్నించ‌గా.. `నాకూ ఉంటాయి. మ‌నం రూ. 150 సంపాదిస్తే 200 సమస్యలు వ‌స్తాయి. అదే రూ. కోటి సంపాదిస్తే 2 కోట్ల సమస్యలు వ‌స్తాయి` అంటూ ధ‌నుష్ ఆస‌క్తిక‌రంగా బ‌దులిచ్చాడు. ప్ర‌స్తుతం ధ‌నుష్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: