కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి శ్రీపాద మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. మహిళలకు ఏ మాత్రం అన్యాయం జరిగినా చిన్మయి స్పందిస్తారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి తాజాగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ గురించి రియాక్ట్ కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఒక నెటిజన్ తన పోస్ట్ లో జానీ మాస్టర్ గతంలో ఏం జరగనట్లుగా తన పని తానూ చేసుకుని పోతున్నాడని పేర్కొన్నారు.

నటుడు దిలీప్ కు ఇప్పటికీ రెస్పెక్ట్  లభిస్తుందని  జాన్ విజయ్ కూడా ఇప్పటికీ తన వర్క్ లో  కొనసాగుతున్నాడని  వేదాన్  కు ఇప్పటికీ హైప్ ఉందని వైరముత్తు  పొలిటికల్ గా ఇప్పటికీ ఇన్ఫ్లుయెన్స్  చేయగలిగే స్థితిలో ఉన్నాడని  పేర్కొన్నారు. కార్తీక్ ఇప్పటికీ డిమాండ్ ఉన్న గాయకుడని  వేటగాళ్లకు ఎప్పటికీ  ఏమీ మారాడని  నెటిజన్ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్  గురించి  సింగర్ చిన్మయి స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మైనర్ అమ్మాయిపై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ బయటకు వచ్చారని చిన్మయి కామెంట్లు చేశారు. మనం ప్రతిభావంతులైన నేరస్థులను ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తుందని  వాళ్ళను మనం ప్రోత్సహించడంతో పాటు అధికార స్థానాల్లో సైతం కొనసాగిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు.  వాళ్ళు తమ పదవులను వేధించడానికి ఉపయోగిస్తున్నారంటూ   చిన్మయి ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు.

జానీ మాస్టర్ ను టార్గెట్ చేస్తూ  చిన్మయి  చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. గతంలో  కూడా  జానీ మాస్టర్ ను టార్గెట్  చేస్తూ చిన్మయి పలు పోస్టులు చేసిన సంగతి తెలిసిందే.  అయితే కొందరు నెటిజన్లు  మాత్రం అమ్మాయి కోణంలో మాత్రమే కాకుండా అబ్బాయి కోణంలో సైతం ఏం జరిగిందో ఆలోచించాలని పేర్కొన్నారు.  ఏ సంబంధం లేని కొంతమందిని సైతం వివాదాల్లోకి లాగుతున్నారని అభిప్రాయపడుతున్నారు. చిన్మయి పోస్ట్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: