
అయితే ఫాస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన ఈ సినిమా ఆ తర్వాత మాత్రం కలెక్షన్లకు సంబంధించి తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది. మరోవైపు అటు దిల్ రాజు ఇటు నితిన్ నమ్మిన తమ్ముడు సినిమా ప్రేక్షకులకు షాకిచ్చింది. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకునే విషయంలో పూర్తిస్థాయిలో ఫెయిల్ అయిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
ఈ సినిమా కథ ఎంసీఏ సినిమాను పోలి ఉండటం కూడా మైనస్ అయింది. తమ్ముడు మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఈ సినిమా ఫలితం ఏంటో అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలు బాగానే ఉన్నా మరీ అద్భుతం అనే రేంజ్ టాక్ ను సొంతం చేసుకోకపోవడం కూడా సినిమా ఫలితంపై ప్రభావం చూపిందని చెప్పవచ్చు.
కన్నప్ప మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు మాత్రం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీలో సైతం ఒకింత ఆలస్యంగానే స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. తమ్ముడు సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. మంచు విష్ణు నితిన్ భవిష్యత్తు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు