
శేఖర్ కమ్ముల ఎక్కడ వల్గారిటి చూపించరు అని.. ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా తెరకెక్కిస్తారు అని ..ఆయన తెరకెక్కించే సినిమాలు కుటుంబ సమేతంగా కలిసి చూడొచ్చు అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా అంతే నీట్ గా క్లీన్ గా ఉంటాయి . అయితే రీసెంట్ గానే "కుబేర" సినిమాతో హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమాను నానితో కమిట్ అయ్యాడు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ కాంబో కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్.
అయితే ఇది ఓ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిచాలనుకుంటున్నారట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆ కారణంగానే ఈ సినిమాలో వేరే క్యారెక్టర్ కోసం పలువురు స్టార్ హీరోస్ ని అప్రోచ్ అవుతున్నారట . తాజాగా ఆ హీరో రోల్ కోసం రవితేజ ఓకే అయినట్లు తెలుస్తుంది . రవితేజ - నాని కాంబోలో సినిమా అని జనాలు అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఈ కాంబో రాబోతుంది అన్న వార్త ఇప్పుడు తెలుగు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ కాంబో సెట్ అయితే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. రవితేజ్ మాస్ హీరో..నాని క్లాస్ హీరో..మరి కాంబో లో సినిమా అంటే రచ్చ రంబోలానే. చూడాలి మరి శేఖర్ కమ్ముల ఏం చేస్తాడు అనేది..??