
పవన్ కళ్యాణ్ ను మాస్ అండ్ గ్యాంగ్ స్టార్ లుక్ లో చూపెట్టాడు సుజిత్ . ఇది పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అయిందని చెప్పుకోవచ్చు . గత కొంతకాలంగా డిజాస్టర్లతో ఉన్న పవన్ ను బ్లాక్ బస్టర్ లోకి తీసుకొచ్చాడు సుజిత్ . తన ఆరేళ్ల కష్టాన్ని నిరబెట్టుకున్నాడు . ఈ సినిమా కోసం దాదాపు సుజిత్ ఆరేళ్లుగా కష్టపడుతున్నాడట . మొత్తానికి తాను అనుకున్నది సాధించాడని చెప్పుకోవచ్చు . ఇక ఈ సినిమాలో పలు సీన్లు కట్ అయినా కారణంగా అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం . ఇందులో నేహా షర్టి స్పెషల్ సాంగ్ ఒకటి కట్ అయ్యింది . ఈ మూవీలో నేహా ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు నేహశెట్టి కూడా అఫీషియల్ గా ఓ ఈవెంట్లో ప్రకటించింది .
అయితే ఈ చిత్రంలో ఆమె కనిపించక పోయేసరికి కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు పవన్ అభిమానులు . ఈ నేపథ్యంలోనే వారికి కిక్ ఇచ్చే అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది . నేహా షటిష్ స్పెషల్ సాంగ్ తో పాటు పలు సీన్లు ఈ సోమవారం నుంచి యాడ్ చేయనున్నట్లు ఓ ట్వీట్ చక్కర్లు కొడుతుంది . దీంతో మరోసారి థియేటర్స్ కు వెళ్లి రచ్చ చేయాల్సిందే అంటూ పవన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు . ఏదేమైనప్పటికీ ఇది ఈ మూవీకి ప్లస్ అవ్వను ఉందనే చెప్పుకోవచ్చు . మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి .