ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరిన సంగతి మనకు తెలిసిందే.అయితే కూటమిలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నా కానీ కూటమి అధినేతలు వాటిని సర్దుకొని వెళ్తున్నారు. అయితే తాజాగా అసెంబ్లీలో జరిగిన ఇష్యూ మాత్రం పెద్దదయ్యేలాగా కనిపిస్తుంది. ఏపీ అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ జగన్ హయాంలో సినీ ఇండస్ట్రీ వాళ్ళను అవమానించారు. చర్చల కోసం పిలిచి తీరా ఆఫీస్ కి వచ్చాక ఇండస్ట్రీ వాళ్లని కలవకుండా అవమానించారు. ఆ తర్వాత చిరంజీవి వెళ్లి గట్టిగా మాట్లాడడంతో వెంటనే జగన్ వచ్చారంటూ ఎమ్మెల్యే మాట్లాడడంతో ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకృష్ణ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆ సైకో గాడిని అంటూ జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆరోజు గట్టిగా ఎవరూ అడగలేదు.

ఎవడు అడిగాడో చెప్పమనండి.. చిరంజీవి అడిగితే ఆయన కలవడానికి రాలేదు. సైకో నే వచ్చాడు.. అంతేకానీ ఎవరు గట్టిగా అడగలేదు.ఆరోజు చిరంజీవిని అవమానించింది అనేది మాత్రం వాస్తవమే. ఇక ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నా పేరు 9 స్థానంలో పెట్టారు.వెంటనే నేను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారి కి చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశాను.నా పేరు 9వ స్థానంలో పెట్టి నన్ను అవమానించారు. ఏదైనా సరే క్లియర్ గా చెప్పడానికి.ఏదైనా సరే క్లియర్ గా చెప్పడానికి అసెంబ్లీకి వచ్చాను.ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అన్నట్లుగా కాస్త సీరియస్ గా మాట్లాడి బాలకృష్ణ కూర్చున్నారు. అయితే బాలకృష్ణ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.అంతేకాదు బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలపై చిరంజీవి స్పందిస్తూ..బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడడం నేను కూడా టీవీలో చూసాను.

 నా గురించి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. జగన్ పిలిస్తేనే మేం వెళ్ళాం. జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు.అలాగే కరోనా కారణంగా ఐదుగురమే వెళ్లాల్సి వచ్చింది. ఆరోజు బాలకృష్ణని కూడా రమ్మని పిలిచాము. కానీ ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల రాలేదు. మా అందరిని జగన్ సాదరంగా ఆహ్వానించారు అంటూ చెప్పుకోచ్చారు.అయితే బాలకృష్ణ మాటలకి చిరంజీవి చురకలు అంటించే సరికి చాలామంది నెటిజన్స్ ఈ వివాదం మరింత దూరం వెళ్లేలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో లేని సమయం చూసి చిరంజీవిపై సెటైర్లు వేస్తూ మాట్లాడారు. అదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటే బాలకృష్ణ అలా మాట్లాడేవారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: