భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఓజి మూవీ ఎట్టకేలకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని అరేంజ్ చేసింది. అయితే ఈ సక్సెస్ మీట్ లో సుజీత్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ ముగ్గురి వల్లే ఓజీ మూవీ హిట్ అయింది అంటూ సుజీత్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఓజి మూవీ హిట్ అవ్వడానికి అసలు కారకులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఏర్పాటు చేసిన ఓజి సక్సెస్ మీట్ లో సుజిత్ మాట్లాడుతూ.. ఓజి మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయనకు ఓ పెద్ద హిట్ సినిమాని అందించాను.

 ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమానినో మీకు తెలుసు. అలాంటిది ఆయనకు ఇంత పెద్ద హిట్ సినిమాని అందించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు అనుకున్నా. కానీ ఆయనతో సినిమా చేశా.ఈ సినిమా హిట్ కావడంలో ముగ్గురు పాత్ర ప్రధానంగా ఉంది. వాళ్లు ముగ్గురే ఈ సినిమాకి పిల్లర్లు. వాళ్ళ ముగ్గురి వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. అందులో ఒకరు తమన్ అన్న, మరొకరు కెమెరామెన్ రవి కే.చంద్రన్ సార్, ఇంకొకరు ఎడిటర్ నవీన్ నూలి.. ఈ ముగ్గురి వల్లే ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. వీళ్లే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్లు. ఒక్కొక్కసారి తమన్ అన్నని చూస్తే నేను కూడా షాక్ అయిపోయా..

ఏంటన్నా నీకు ఇంత నమ్మకం అని.. కానీ తమన్ అన్న మాత్రం ఏమి కాదు నువ్వు ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను తమ్ముడు అని ప్రేమగా మాట్లాడేవారు. ఆ సమయంలో అన్నని చూస్తే భయమేసేది. ఈ సినిమా హిట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఓజి సినిమా కోసం అన్ని రకాలుగా సహకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు సుజీత్. ఫైనల్ గా ఓజి మూవీ హిట్ తో ఇండస్ట్రీ మొత్తం ఓజి జపం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: