
సినిమా ఇండస్ట్రీలో హిట్‌కు ఒకే ఫార్ములాతో అవసరం ఉండదు. సినిమా హిట్ అనేది అనేక అంశాలమీద ఆధారపడి ఉంటుంది. కథ, దర్శకత్వం, నటన, సాంకేతిక నైపుణ్యం, విడుదల టైమింగ్, ప్రేక్షకుల అభిరుచి ఉంటుంది. కొందరు దర్శకనిర్మాతలు ఒక హిట్ సినిమా తర్వాత అదే తరహాలో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో స్టార్ హీరోలు కూడా గతంలో హిట్ సినిమాలను ఫాలో అయ్యే కథలు ఎంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇవి సక్సెస్ కాని సందర్భాలు కూడా ఉంటాయి. మహేష్‌బాబు పోకిరి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసిన మెహర్ రమేష్ అదే టైంలో ఎన్టీఆర్‌తో తీసిన కంత్రి సినిమా పోకిరిని పోలి ఉందన్న విమర్శలు వచ్చాయి. ట్విస్టులు, డైలాగులు అన్నీ పోకిరిలాగానే ఉన్నాయన్న కామెంట్లు వచ్చాయి. పోకిరి కంటే కంత్రి ముందు విడుదలై ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేదని సిని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.
మహేష్ దూకుడు హిట్ అవ్వగా.. అదే ఫార్మాట్‌లో ఎన్టీఆర్ బాద్ షా సినిమా చేస్తే యావరేజ్ అయ్యింది. మగధీర బ్లాక్‌బస్టర్ అయ్యాక శక్తి తీస్తే డిజాస్టర్ అయ్యింది. ఊసరవెల్లి సినిమాలో కిక్ హీరో క్యారెక్టర్ ఉండడం.. రామయ్యా వస్తావయ్యా సినిమాలో రెబల్ పోలికలు ఉండడం ఇవన్నీ ఎన్టీఆర్ సినిమాలను దెబ్బకొట్టాయి. వరుస ప్లాపుల తర్వాత ఎన్టీఆర్ కథల ఎంపికలో పూర్తిగా మారిపోయారు. ఆ తర్వాత వరుసగా "టెంపర్", "నాన్నకు ప్రేమతో", "జనతా గ్యారేజ్", "అరవింద సమేత", "ఆర్ఆర్ఆర్" వంటి చిత్రాలన్నీ కొత్త కాన్సెఫ్టులతో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు