
మరీ ముఖ్యంగా ముందు అనుకున్న స్పిరిట్ స్టోరీని ఆ తర్వాత పూర్తిగా మార్చేసాడు సందీప్ రెడ్డివంగా అంటూ కూడా ఓ న్యూస్ బాగా బాలీవుడ్ లో ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా ఓ ఫంక్షన్ కి అటెండ్ అయిన సందీప్ రెడ్డి వంగకు అక్కడ ఉండే వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు . ఈ క్రమంలోనే సందీప్ రెడ్డివంగా ఒక క్రేజీ న్యూస్ ని బయటపెట్టేసారు. కొద్ది కాలంగా ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ కొరియన్ నటుడు డాంగ్ లీ విలన్ గా ఇండియన్ సినిమాకు పరిచయం కాబోతున్నాడు అనే వార్త వైరల్ అయ్యింది.
అయితే ఇదే విషయాన్ని సందీప్ రెడ్డి వంగాను ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ "మీరు అనుకున్నదే నిజం అవుతుంది ఓకేనా" అంటూ రిప్లై ఇచ్చారు. అనఫీషియల్ గా ఈ సినిమాలో ఆయనే విలన్ అన్న వార్తలు కన్ఫామ్ చేసేసారు . దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో "స్పిరిట్" ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . డాంగ్ లీ విలన్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు అనేది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫామ్ అయిపోయింది . ఇక తెరపై ప్రభాస్ అలాగే డాంగ్ లీ సీన్స్ ఎలా తెరకెక్కించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ అనేది బిగ్ ఇంట్రెస్టింగ్గా మారింది..!?